ISRO: Space Agency Launches Radar Imaging Satellite, 2 Others Detail In Telugu - Sakshi
Sakshi News home page

ISRO: పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

Published Mon, Feb 14 2022 6:23 AM | Last Updated on Mon, Feb 14 2022 9:05 AM

Space Agency ISRO Launches Radar Imaging Satellite, 2 Others - Sakshi

శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్‌–04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్లోని ఫస్ట్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు.

కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే..
వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్‌ఐశాట్‌-1 ఉపగ్రహం
భారత్‌, భూటాన్‌ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్‌ఎస్‌-2టీడీ
భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్‌ కోసం ఐఎన్‌ఎస్‌-2టీడీ ఉపగ్రహం
భూమి అయానోస్పియర్‌ అధ్యయనం కోసం ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహం

స్పందించిన ఇస్రో చైర్మన్‌
పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ తెలిపారు. దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement