సాక్షి, తిరుచానూరు: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ దంపతులు శనివారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్, డిప్యూటీ ఈవో ఝాన్సీ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార‍్థించినట్లు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్
తిరుమల: చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-2 వాహక నౌక నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు. రెండు నెలల అనంతరం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుంటుందన్నారు. వర్షం వల్ల చంద్రయాన్-2 ప్రయోగానికి ఎలాంటి అంతరాయం కలగదని శివన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment