తిరువనంతపురం: 2040 ఏడాదికల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ మంగళవారం చెప్పారు. ‘‘వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు నలుగురు భారత వాయుసేన పైలట్లను ఎంపికచేశాం. వారికి శిక్షణలో కొనసాగుతోంది. వ్యోమగాములను ముందు లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ)లోకి ప్రవేశపెట్టి సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దించుతాం’’ అని వెల్లడించారు.
‘‘గగన్‌యాన్ కోసం మనుషులు ప్రయాణించే హెచ్‌ఎల్‌వీఎం3 వ్యోమనౌక, క్రూ మాడ్యుల్ ఉండే ఆర్బిటల్ మాడ్యూల్, సరీ్వస్ మాడ్యల్, ప్రాణాధార వ్యవస్థలు కావాలి. ముందు మానవరహిత ప్రయోగాలను పూర్తిచేయాలి. ఒకే పోలికలు ఉండే రెండు మానవరహిత మిషన్‌లు(జీ1, జీ2), ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ పరీక్ష తదితరాలను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
చంద్రుడిని చేరాక సురక్షితంగా తిరిగొచ్చేందుకు వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యుల్(సీఎం) తయారీ, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది తప్పించుకునే క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్)లనూ అభివృద్ధిచేసుకోవాల్సి ఉంది’’ అని సోమనాథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment