
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో నందమూరి కల్యాణ్ రామ్, తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, ఇస్రో చైర్మన్ శివన్ స్వామి ఈరోజు ఉదయం స్వామిని దర్శించుకున్నారు. రేపు ఉదయం 4:04 గంటలకు పీఎస్‌ఎల్వీసీ-41 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంతన ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్టు శివన్ స్వామి తెలిపారు.
అదే విధంగా కల్యాణ్ రామ్ కుటుంబంతో స్వామివారిని దర్శించుకుని మెక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను ఆలయ అధికారులు అందించారు. కల్యాణ్‌రామ్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చిత్రం విజయం సాధించి, మంచి వసూళ్ళు రాబడుతున్న సందర్భంగా స్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment