ఆదిత్య పంపిన సెల్ఫీ లో కనిపిస్తున్న వెల్సీ, సూట్ అనే పేలోడ్లు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడి దిశగా దూసుకుపోతున్న ఆదిత్య–ఎల్1 కెమెరా పని మొదలుపెట్టింది. తన సెల్ఫీతోపాటు భూమి, చంద్రుడిని కూడా క్లిక్ మనిపించింది. ఈ మేరకు ఆదిత్య–ఎల్1 నుంచి అందుకున్న ఫొటోలను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో విడుదల చేసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన కెమెరా ఈనెల 4న తీసిన సెల్ఫీలో వీఈఎల్‌సీ (విజిబుల్ ఎమిషన్ లైన్), ఎస్‌యూఐటీ(సోలార్ అ్రల్టావయొలెట్) పరికరాలు కనిపిస్తున్నాయి.
అదే కెమెరా భూమి, చంద్రుడి ఫొటోలను కూడా తీసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన ఏడు వేర్వేరు పేలోడ్లలో వీఈఎల్‌సీ, ఎస్‌యూఐటీలు కూడా ఉన్నాయి. ఆదిత్య–ఎల్1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజియన్ పాయింట్1(ఎల్1)లోని తన నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నాక సూర్యుడి చుట్టు పరిభ్రమిస్తూ వీఈఎల్‌సీ పేలోడ్ ద్వారా రోజుకు 1,440 ఫొటోలను తీసి భూనియంత్రిత కేంద్రాలకు విశ్లేషణ నిమిత్తం పంపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment