సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్‌1 | ISRO sets to launch Aditya-L1 solar mission on 2 Sep 2023 - Sakshi
Sakshi News home page

సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్‌1

Published Thu, Aug 31 2023 5:57 AM | Last Updated on Thu, Aug 31 2023 12:23 PM

ISRO sets launch of Aditya-L1 solar mission on 2 sep 2023 - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్‌ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్‌ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా.

సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది?
► ఆదిత్య–ఎల్‌1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది.  
► సౌర అతినీలలోహిత ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌) అనే పేలోడ్‌ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్‌ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్‌ చిత్రాలను అందిస్తుంది.  
► ఆదిత్య సోలార్‌ విండ్‌ పారి్టకల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (యాస్‌పెక్స్‌) అనే పేలోడ్‌ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది.  
► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్‌ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది.  
► సోలార్‌ ఎనర్జీ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్‌) సోలార్‌ కరోనా సమస్యాత్మకమైన కరోనల్‌ హీటింగ్‌ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్‌–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది.
► హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటర్‌ (హెలియోస్‌) సౌర కరోనాలో డైనమిక్‌ ఈవెంట్‌లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది.  
► మ్యాగ్‌ అనే ఈ పేలోడ్‌ను  ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది.


ఆదిత్య–ఎల్‌1లో పేలోడ్స్‌ ఇవే..
సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్‌ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్‌ బిందువు–1 (ఎల్‌–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్‌ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్‌) ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement