సాక్షి, అమరావతి: చంద్రయాన్-3 విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్ అభినందించారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో గర్వించదగిన స్థానం సాధించారని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో చంద్రయాన్-2 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కాగా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయనుంది. ఆ తరువాత చంద్రుని వైపు పయనించనుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది.
శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని సంస్త ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామన్నారు. ఇస్రో టీమ్‌కు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అభినందలు తెలిపారు. ప్రపంచ దేశాలకు దీటుగా ఇస్రో పరిశోధనలు చేస్తోందని తెలిపారు.
చదవండి: Chandrayaan-3 Moon Mission Launched: విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 రాకెట్
Comments
Please login to add a commentAdd a comment