వాషింగ్టన్ : ‘స్పేస్ ఎక్స్’ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత రాకేట్‌ను దిగ్విజయంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ఆదివారం ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ప్రయాణమైంది. స్పేస్ ఎక్స్, నాసాలు సంయుక్తంగా చేపట్టిన తొలి మానవసహిత ఆపరేషనల్ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన వ్యోమగాములు మైకెల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, శనాన్ వాకర్, జపాన్‌కు చెందిన సోచి నగూచీలు ఈ మిషన్‌లో భాగమయ్యారు. ఆదివారం రాత్రి 7:27 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకేట్ ఐఎస్‌ఎస్‌కి బయలుదేరింది. అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ ఈ ప్రయోగాన్ని కొనియాడారు. ( త్వరలో ఫైజర్ కరోనా టీకా సరఫరా )
సోమవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ మన తెలివి, సంకల్ప బలం ద్వారా సాధించిన విజ్ఞాన శక్తికి ఇది నిదర్శనం.. ఎంతో గొప్పది’’ అని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా దీనిపై స్పందించారు ‘‘అమెరికా మానవ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం’’ అని అన్నారు. కాగా, గత మే నెలలో స్పేస్ ఎక్స్‌కు చెందిన ఓ రాకేట్ ఇద్దరు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి నష్టం లేకుండా ఆగస్టు నెలలో క్షేమంగా భూమిపైకి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment