
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు.
షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్ భవనంలో పీఎస్‌ఎల్‌వీ మొదటి, రెండు దశలు రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. మూడు, నాలుగు దశలను మొబైల్ సర్వీస్ టవర్‌లో అనుసంధానం చేసి సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు.