వాషింగ్టన్: మార్స్ మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘స్సేస్ ఎక్స్’ హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్‌షిప్ నమూనా ఒకటి ల్యాండ్ అవుతుండగా పేలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. టెక్సాస్‌లో బుధవారం ఉదయం టెస్ట్ లాంచ్ సందర్భంగా ఈ పేలుడు చోటు చేసుకుంది. కానీ సంస్థ మాత్రం ఎంతో ‘అద్భుతమైన పరీక్ష.. స్టార్‌షిప్ టీమ్‌కు ధన్యవాదాలు’ అంటూ మెసేజ్ చేయడం గమనార్హం. టెస్ట్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్ట్‌ని ఉద్దేశించి ‘మార్స్.. మేం రాబోతున్నాం’ అంటు ట్వీట్ చేశారు. ల్యాండింగ్ స్పీడ్‌ను పెంచడం వల్లే ఈ పేలుడు సంభంవించినట్లు సమాచారం. స్టార్‌షిప్ క్రాష్ అయినప్పటికి.. ఈ పరీక్షలో విజయవంతమైన భాగాలను ఎలాన్ వివరించారు. టేకాఫ్, దాని (పేలుడు పూర్వ) ఖచ్చితమైన ల్యాండింగ్ పథం వంటి అంశాల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ‘స్టార్ షిప్ కూలిపోయినప్పటికి మాకు అవసరమైన మొత్తం డాటా లభించింది! అభినందనలు స్పేస్‌ఎక్స్ బృందం" అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.(చదవండి: ‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ప్రాజెక్టు)
బుధవారం టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌షిప్ కక్ష్యలోకి అధిరోహించింది, ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి ఇంజన్లు బయటకు వచ్చాయి. నింగిలోకి దూసుకెళ్లిన 4 నిమిషాల 45 సెకన్ల వ్యవధి తర్వాత స్టార్‌షిప్ మూడవ ఇంజిన్ ఆరిపోయింది. దాన్ని నెమ్మదింపజేసే ప్రయత్నంలో అంతవరకు ఆపేసిన ఇంజన్లను పునః ప్రారంభించారు. కాని అది భూమిపైకి దూసుకెళ్లింది. క్రాష్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment