Big Bang
-
మాధురి దీక్షిత్‌పై అసభ్య పదజాలం.. తీవ్రస్థాయిలో మండిపడ్డ జయాబచ్చన్
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' షోపై బాలీవుడ్ నటి జయాబచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలోని ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్ షోలో మాధురి దీక్షిత్‌పై చేసిన కామెంట్స్‌పై ఆమె జయాబచ్చన్ ఫైరయ్యారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్ ఐశ్యర్యారాయ్‌తో పోలుస్తూ మాధురీ దీక్షిత్‌ను వేశ్య అని సంభోదించారు. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికేమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రికి తరలించాలని అన్నారు. అతని వ్యాఖ్యల పట్ల వారి కుటుంబ సభ్యులను నిలదీయాలని మండిపడ్డారు. ఈ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పార్సన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను పొగిడారు. అదే సమయంలో మాధురీ దీక్షిత్‌ను పోలుస్తూ కునాల్ నయ్యర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలతో ఇండియాలో జనాదరణ పొందిన అమెరికన్ సిట్కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణమని అన్నారు. ఇది వారి చీప్ మెంటాలిటీని చూపిస్తోందని మండిపడ్డారు. ఇలా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉందని దియా మీర్జా అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు అయితే ఈ ఎపిసోడ్‌ను తొలగించాలని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్‌ఫ్లిక్స్‌కి లీగల్ నోటీసులు పంపారు. సీజన్ టూ మొదటి ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌పై కునాల్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయిని.. పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీసులో పేర్కొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ 'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది చక్ లోర్రే, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్కామ్. ఇది 2007లో ప్రారంభం కాగా.. 12 సీజన్ల తర్వాత చివరి ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది. -
నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో డిజైన్ చేసి, నిర్మించిన సరస్–3 రేడియో టెలిస్కోప్‌తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్ వాటర్స్ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్ఆర్ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ టెల్ అవివ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్–3 టెలిస్కోప్ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్ఆర్ఐ ప్రతినిధి సౌరభ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్–3 రేడియో టెలిస్కోప్ కాస్మిక్ డాన్ ఆస్ట్రోఫిజిక్స్‌పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలాన్ని కాస్మిక్ డాన్‌గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉండేవి. -
4 కోట్ల గంటలు.. 10 వేల మంది.. 76 వేల కోట్ల ఖర్చు
విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆదిమ కాలం నుంచి మానవుడికి ఉండేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ జిజ్ఞాసతో టెలిస్కోపుల నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద టెలిస్కోపును నిర్మించడం జరిగింది. ఇంతవరకు విశ్వ రహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం డిసెంబర్ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడనుంది. విశ్వ రహస్యాలను వివరంగా చూపించే ఈ టెలిస్కోపు నిర్మాణం నుంచి ప్రయోగం వరకు అనేక విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం.. 10,000 మంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యముంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్లో ఫ్రెంచ్ గినియాలోని గినియాస్పేస్ సెంటర్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు. 25 సంవత్సరాలు 1996లో ఎన్జీఎస్టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్ వెబ్ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. 2011లో అమెరికా చట్టసభల కేటాయింపుల కమిటీ ఈ ప్రాజెక్టును ఏకంగా రద్దు చేయాలని పత్రిపాదించింది. ఆ సమయంలో దీన్ని నేచర్ పత్రిక ‘ఖగోళ నిధులు మింగేస్తున్న టెలిస్కోపు’గా అభివర్ణించింది. అయితే రద్దు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా కాంగ్రెస్ టెలిస్కోపు నిర్మాణాన్ని కొనసాగించే నిధులను కేటాయించింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది. రూ.76 వేల కోట్లు సుదీర్ఘకాలం కొనసాగడంతో దీని నిర్మాణానికి చాలా నిధులు వెచ్చించారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది. లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమణం డిసెంబర్ 22న ప్రయోగంతో దీన్ని భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. టెలిస్కోపులోని దర్పణాలను, పరికరాలను –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు దీనికి సిలికాన్, అల్యూమినియం పూత పూసిన సౌర కవచాన్ని తొడిగారు. హబుల్ భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది. 11 రోజులు ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్2 పాయింటుకు చేరుకుంటుంది. అక్కడ కక్ష్యలో ప్రవేశించాక అంతవరకు ముడుచుకుని ఉన్న దర్పణం తెరుచుకొని పని ప్రారంభిస్తుంది. ఇందులో ప్రాథమిక దర్పణం కాకుండా మరో మూడు దర్పణాలు, లైట్ డిటెక్టర్, స్టార్ ట్రాకర్స్, సోలార్ ప్యానెల్స్, యాంటెన్నాలాంటి ఇతర భాగాలుంటాయి. 458 జీబీ కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. 1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. జేమ్స్ వెబ్ పరారుణ సామర్థ్యంతో బిగ్ బ్యాంగ్ అనంతరం కొన్ని పదుల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడిన తొలి గెలాక్సీల గురించి పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు. ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్ సైన్స్(డిడి–ఇఆర్ఎస్) కార్యక్రమం, గ్యారెంటీడ్ టైమ్ అబ్జర్వేషన్స్(జిటిఓ) కార్యక్రమం, జనరల్ అబ్జర్వర్స్(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు. నేషనల్ డెస్క్, సాక్షి -
సూపర్ హ్యూమన్స్‌తో మానవాళి అంతం
లండన్: స్టీఫెన్ హాకింగ్.. పరిచయం అక్కర్లేని పేరు. విశ్వ ఆవిర్భావ రహస్యాలను, టైమ్ ట్రావెల్ సహా భవిష్యత్ పరిణామాలను సశాస్త్రీయంగా పండిత, పామరులకు అర్థమయ్యేలా వివరించిన భౌతిక శాస్త్రవేత్త హాకింగ్. బిగ్ బ్యాంగ్ నుంచి బ్లాక్ హోల్స్ వరకు విశ్వ రహస్యాలను వివరిస్తూ హాకింగ్ రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పాపులర్. మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతూ, వీల్ చెయిర్‌కే పరిమితమైన పరిస్థితిలోనూ ఆయన పరిశోధనలను వదల్లేదు. ఏడు నెలల క్రితమే ఈయన మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆలోచనలతో కూడిన పుస్తకం ఒకటి త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుత సాధారణ మానవాళిని సమూలంగా అంతమొందించే ‘సూపర్ హ్యూమన్’ తరమొకటి రాబోతోందని ‘బ్రీఫ్ ఆన్సర్స్ టు ద బిగ్ క్వశ్చన్స్’ అనే పుస్తకంలో హెచ్చరించారు. అత్యాధునిక జన్యుసాంకేతికత సాయంతో అపార మేధోశక్తి సామర్థ్యాలతో రూపొందనున్న ఆ సూపర్ హ్యూమన్స్‌తో సాధారణ మనుషులు ఎందులోనూ పోటీ పడలేరన్నారు. ‘సూపర్ హ్యూమన్స్ జీవం పోసుకున్న తరువాత సాధారణ మానవాళికి మరణం తప్ప మరో మార్గం ఉండదు’ అని స్పష్టం చేశారు. ‘సంపన్నులు తమతో పాటు, తమ పిల్లల డీఎన్ఏలో అవసరమైన మేరకు మార్పులు చేసుకుని.. అద్భుతమైన జ్ఞాపకశక్తి, గొప్ప వ్యాధి నిరోధకత, అంతులేని మేధో శక్తి, మరింత ఆయుర్దాయం.. మొదలైన ఎంపిక చేసుకున్న లక్షణాలతో సూపర్ హ్యూమన్స్‌గా తమ సంతతిని వృద్ధి చేసుకుంటారు’ అని చెప్పారు. మేధో సామర్థ్యాన్ని, భావోద్వేగాలను మార్పు చేసుకోగల జన్యు సాంకేతికతను మన శాస్త్రవేత్తలు ఈ శతాబ్దంలోనే అభివృద్ధి చేయగలరని బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ముందు జాగ్రత్తగా మానవుల జన్యు క్రమంలో మార్పులు చేయడాన్ని నిషేధించేలా చట్టాలు రూపొందించాల్సి రావచ్చని కూడా ఆయన ఊహించారు. క్రిస్పర్ అనే డీఎన్ఏ ఎడిటింగ్ విధానాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ప్రమాదకర జన్యువులను మార్చడం లేదా కొత్త జన్యువులను చేర్చడం ఆ విధానం ద్వారా సాధ్యమవుతుంది. ఇది ఆవిష్కృతమై ఆరేళ్లైంది. హాకింగ్ పేర్కొన్న ఈ సూపర్ హ్యూమన్స్ థీయరీని పలువురు శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. ‘భూమిని, వాతావరణాన్ని.. దాని పరిమితికి మించి దుర్వినియోగపర్చాం. దాని పర్యవసానంగా రానున్న ప్రమాదరక సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం మనకున్న మేధో పరిమితులతో సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భూమిని సమూల విధ్వంసం నుంచి కాపాడేందుకు హాకింగ్ చెబుతున్న సూపర్హ్యూమన్స్ మనకు అవసరం’ అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో క్లైమేట్ సైన్స్ బోధించే క్రిస్ రాప్లీ వ్యాఖ్యానించారు. -
తుదిదశలోనూ హాకింగ్ పరిశోధన
లండన్ : ఖగోళంలో ఎవరూ దృష్టి సారించని అంశాలపై ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఎన్నో పరిశోధనలు జరిపారు. భౌతిక శాస్రంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన ఆయన విశ్వంలో మనిషిని పోలిన జీవులు ఉండొచ్చని తెలిపి, దానిని నిరూపించడానికి అలుపెరగని ప్రయత్నాలు చేశారు. తన పరిశోధనల సారాన్ని వివరిస్తూ ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని యువ శాస్త్రవేత్తలకు ఇది ఒక గొప్ప దిక్సూచిగా నిలిచింది. అతి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైనా.. మానవులకు ఏదో మేలు చేయాలనే తపన స్టీఫెన్ హాకింగ్ది. స్టీఫెన్ హాకింగ్ తుదిశ్వాస వరకు పరిశోధనలోనే నిమగ్నమయ్యారు. అందుకు నిదర్శరం తాను చనిపోవడానికి రెండువారాలకు ముందు ఆయన సమర్పించిన పరిశోధనా పత్రాలు. తాను ముందునుంచి చెబుతున్నట్టు.. విశ్వం ఒక్కటే లేదని, దానిని పోలిన విశ్వసముదాయాలు ఎన్నెన్నో ఉన్నాయని పేర్కొంటూ.. తన వాదనకు బలం చేకూర్చే సమాచారాన్ని ఈ పరిశోధనా పత్రాల్లో హాకింగ్ పొందుపర్చారు. ‘ఏ స్మూత్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్’ పేరుతో ప్రచురించిన ఈ పత్రాలలో మానవ మనుగడ ఎక్కువ కాలం నిలవదని, వేరే సురక్షితమైన ప్రాంతానికి తరలివెళ్లక తప్పదని తాను ఎప్పటినుంచో చెబుతున్న థియరీకి సంబంధించి వివరణాత్మక విషయాలను పొందుపరిచారు. ‘ఒక పరమాణువు విస్తరించడం వల్లే నేటి విశ్వం ఆవిర్భవించింది. మనకున్న బిగ్ బ్యాంగ్ థియరీలాగే, ఇతర జీవులకు విశ్వాన్ని పోలిన ఆవాసం తప్పకుండా ఉంటుందని’ అని స్టీఫెన్ తన పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు. -
విక్రమన్ దర్శకత్వంలో సూర్య
నటనలో వైవిధ్యం కోసం తపించే నటుల్లో సూర్య ఒకరు. ఆయన కథలపై చూపే శ్రద్ధ దర్శకులను ఎంపిక చేసుకునే విధానంలో పరిణితి స్పష్టం అవుతుంది. చిత్రం చిత్రానికి తాను ఎదుగుతూ, తన చిత్రాల విజయాల స్థాయిని పెంచుకుంటూ అనతి కాలంలోనే హీరోగా సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదుగుతున్నారు. సింగం, సింగం -2 వంటి రాక్ హిట్లు తరువాత అంజాన్ అంటూ బిగ్ బ్యాంగ్‌తో తెరపైకి రానున్నారు. అంజాన్ ఈ నెల 15న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్‌గా సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు. సూర్య ఆ తరువాత చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో సూర్య నటించనున్నారు. విక్రమన్ ఇంతకు ముందు యావరుంనలం చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఇటీవలే తెలుగులో అక్కినేని కుటుంబంతో మనం అనే చిత్రంతో అద్భుతమయిన విజయాన్ని అందుకున్నారు. ఈ బహుభాషా దర్శకుడు సూర్య కోసం మంచి కమర్షియల్ ఎంటర్ టెయినర్ కథను సిద్ధం చేస్తున్నారట. దీని గురించి విక్రమన్ మాట్లాడుతూ సూర్య కోసం కథ తయారు చేస్తున్న విషయం నిజమేనన్నారు. అయితే ఈ చిత్రం ఆయన నటిస్తున్న మాస్ చిత్రం తరువాత సెట్‌పైకి రానుందని తెలిపారు. ఈ కథ ప్రస్తుతం ఇండియన్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ అంటూ అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఉంటుందన్నారు. చిత్రంలో ఇద్దరు కథా నాయికలు ఉంటారని, అయితే వాళ్ల ఎంపిక జరగలేదని వివరించారు.