
విశాల విశ్వంలో భూగోళాన్ని తలపించే పలు గ్రహాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా మన భూమి నుంచి వంద కాంతి సంవత్సరాల దూరంలో భూమిలాంటి మరో గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమి కంటే ముప్పయి శాతం పెద్దది. ‘టీఓఐ–4306’ అనే నక్షత్రం చుట్టూ తిరిగే ఈ గ్రహం ఉష్ణోగ్రత సూర్యుడి ఉష్ణోగ్రతలో సగానికి సగం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ 2.7 రోజుల్లో తిరుగుతుంది. భూమిపై జీవించే మనుషుల సగటు వయసు 73.5 సంవత్సరాలు. అదే ఈ గ్రహంపై మనుషులు జీవించేటట్లయితే, మనుషుల ఆయుఃప్రమాణం 3,158 ఏళ్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ గ్రహంపై ఏడాది ప్రమాణం చాలా తక్కువ కావడమే దీనికి కారణం. ‘నాసా’కు చెందిన ‘ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్’ (టీఈఎస్‌ఎస్) ఈ గ్రహాన్ని ఇటీవల గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment