
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు తనకు మధ్య సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలపై ప్రముఖ వ్యాపారవేత్త జెన్నిఫర్ ఆర్కురీ స్పందించారు. ఈ వార్తలు తనను తీవ్ర అవమానకరంగా, హృదయవిదారకంగా తోచాయని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ.. వివరణ ఇచ్చారు. జాన్సన్ లండన్ మేయర్‌గా ఉన్న సమయంలో తాను ఆర్థికంగా ఎలాంటి లబ్ధి పొందలేదని తెలిపారు. తనకు, జాన్సన్‌కు సంబంధముందటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తమని చెప్పారు.
అయితే జాన్సన్ తనను ఎందుకు బ్లాక్ చేసి.. దూరంగా ఉంచుతున్నారో తనకు మాత్రం తెలీదన్నారు. ఒక నైట్ స్టాండ్‌లా బార్ వద్ద తను తీసుకువచ్చుకునే అమ్మాయిని కాదని.. తాను ఏంటో తనకు తెలుసని వివరించారు. తమ ఇద్దరిమధ్య ఏదో సంబంధం ఉందని వచ్చిన వార్తలు చాలా అవమానంగా, అసహ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. జాన్సన్ మేయర్‌గా ఉన్న సమయంలో వేల పౌండ్ల ప్రజా ధనాన్ని ఆర్కురీ పొందినట్లు, పలు వాణిజ్య సదస్సులకు పాల్గొనే అర్హత లేనప్పటికి జాన్సన్ జోక్యంతో ఆమె పలు సదస్సులకు హారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.