రిషి సునాక్‌ బ్యాగ్‌ ధరెంతో తెలుసా.. | Rishi Sunak spotted the railway station with a Rs79000 Tumi backpack | Sakshi
Sakshi News home page

రిషి సునాక్‌ బ్యాగ్‌ ధరెంతో తెలుసా..

Published Fri, May 31 2024 8:47 PM | Last Updated on Fri, May 31 2024 9:30 PM

Rishi Sunak spotted the railway station with a Rs79000 Tumi backpack

సెలబ్రిటీలు వాడే ప్రతి వస్తువు సామాన్యులకు ఎప్పుడూ ప్రత్యేకమే. వారు ధరించే షూ, వేసుకునే దుస్తులు, వాడే కారు, పెట్టుకునే వాచీలు, ఉపయోగించే బ్యాగులు.. ఇలా అన్ని స్పెషల్‌గా కనిపిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ రైల్వేస్టేషన్‌లో యూకే ప్రధాని రిషిసునాక్‌ వాడిన బ్యాగ్‌ గురించి నెట్టింట వైరల్‌గా మారింది.

రాబోయే బ్రిటిష్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా రిషి సునక్ ప్రచారంలో పాల్గొనేందుకు ఇటీవల రైలులో ప్రయాణించారు. లండన్‌ నుంచి బయలుదేరిన ఆయన రాత్రంతా రైలు స్లీపర్‌క్లాస్‌లో ప్రయాణించి కార్న్‌వాల్‌కు చేరుకున్నారు. అందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా. రిషి రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే అందరి కళ్లు ఆయనతోపాటు తాను వాడుతున్న బ్యాగ్‌పై పడింది. దేశంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటైన 'ఆర్‌ఎస్‌'ను సూచించే మోనోగ్రామ్‌ ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను ధరిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో వీక్షకులు తాను వినియోగించిన బ్యాక్‌ప్యాక్‌ ధరెంతో తెలుసుకునే పనిపడ్డారు. దీని విలువ సుమారు రూ.79వేలు ఉంటుందని తెలిసింది.

ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..‍క్రూయిజ్‌లో ఫస్ట్‌ బర్త్‌డే

ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రిపోర్ట్‌ ప్రకారం..రిషి సునక్, తన భార్య అక్షతామూర్తి నికర విలువ 651 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లు(సుమారు రూ.6900 కోట్లు). బ్రిటిష్‌ రాజు కింగ్ చార్లెస్ 3 కంటే వీరే సంపన్నులు. ఈ జంట సంపద కేవలం ఒక సంవత్సరంలోనే 120 మిలియన్ పౌండ్లకు పైగా పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement