ఆడవారిలో కేన్సర్ కేసులు సంఖ్య విపరీతం గా పెరుపోతున్న సంగతి తెలిసిందే. అందులోనూ సెర్వికల్ కేన్సర్ మహిళలకు మరింత ప్రాణాంతకంగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ భారత కమ్యూనిటీ(బీబీసీ) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన ఆధ్వరంలో ఆడవారికి వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది.
ఆడవారికి వచ్చే ఈ సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వంహిచారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా మహిళలు పాల్గొని ఈ కేన్సర్ రాకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూలంకషంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే గత నెల మార్చిలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
అప్పుడే ఇలా మహిళ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నట్లు బీబీజీ ఛారిటబుల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా దాదాపు £1,655 పౌండ్లను (సుమారు 1.70 లక్షల రూపాయలు) ఒవేరియన్ కేన్సర్ యాక్షన్ (Ovarian Cancer Action)’ అనే ఛారిటీకి అందజేశామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment