చికాగో ఫ్యాన్స్‌ మీట్‌లో శృతిహాసన్ సందడి | Shruti Haasan In Chicago Fans Meet | Sakshi
Sakshi News home page

చికాగో ఫ్యాన్స్‌ మీట్‌లో శృతిహాసన్ సందడి

Published Tue, Oct 22 2024 7:22 PM | Last Updated on Wed, Oct 23 2024 8:22 PM

Shruti Haasan In Chicago Fans Meet

శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది.  సింగర్‌గా  కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లోకనాయకుడు కమల్‌హాసన్ గారాలపట్టిగా బోల్డెంత పేరు ఉన్నప్పటికి ..తన సొంత టాలెంట్, గ్లామర్‌తో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ..  టాప్ హీరోయిన్‌గా వెలుగుతోంది. పలు సేవా కార్యక్రమంలో పాలుపంచుకునే  శృతిహాసన్‌ రీసెంట్‌గా అమెరికాలో పర్యటించారు.  చికాగోలోని ఫ్యాన్స్‌ మీట్‌లో  పాల్గొని..సందడి చేశారు.

సాక్షి, HR PUNDITS పార్టనర్‌షిప్ గా..  పక్కాలోకల్ పేరుతో నిర్వహించిన  ఈ  ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.  ఈ ఈవెంట్ లో శృతి హాసన్ బార్బీ డాల్‌గా మెరిసిపోతూ.. అభిమానులను కుష్ చేశారు. ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాసన్ ను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వేదికపై శృతిహాసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా వారి కోరిక మేరకు సాంగ్స్ కూడా పాడారు.  అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు దిగారు.  ఈ సందర్భంగా నిర్వహకులు  ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ ప్లాన్‌ చేశారు. శృతి హాసన్  తన సినీ కెరీర్ కు  సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు.  చికాగో తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైనా స్టయిల్ లో సమాధానం ఇచ్చారు.

ఈ ఈవెంట్ లో  శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.  ఈ సందర్బంగా ఆమె సినిమాలకు సంబంధించి పలు ప్రశ్నలను అభిమానులను అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి  శృతిహాసన్ ఆటోగ్రాప్  చేసిన  టీష‌ర్ట్‌లను అందజేశారు. ఇక ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాన్‌కు స‌ర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఇక అందమైన ఫోటో ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంది.  ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించిన నిర్వహకులకు.. శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement