
లండన్‌లో ప్రభాస్ ఓ ఇంటిని కొనుగోలు చేశారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వెకేషన్ లేదా సినిమా షూటింగ్‌ల కోసం లండన్ వెళ్లినప్పుడు అక్కడ నివాసం ఉండేలా ప్రభాస్ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. ఇప్పుడు అదే ఇంటిని ప్రభాస్ సొంతం చేసుకున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా.
లండన్‌లోని ప్రభాస్ ఇల్లు లావిష్‌గా ఉంటుందని, తన అభిరుచికి తగ్గట్లుగా గ్రాండ్‌గా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజాసాబ్’ చిత్రీకరణలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. అలాగే వేసవి తర్వాత ‘సలార్’ మలి భాగం ‘సలార్: శౌర్యంగా పర్వం’ చిత్రీకరణలో ΄ాల్గొననున్నారు ప్రభాస్. ఇంకా మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేస్తారని తెలిసిందే. ఈ ΄ాత్ర చిత్రీకరణ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment