
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society - NATS) 8వ వార్షికోత్సవ తెలుగు సంబరాల ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. అమెరికాలోని టంపాలో జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో నాట్స్ 8వ తెలుగు సంబరాల కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్ అండ్ పూర్వపు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అమెరికా నుండి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు.
నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ.. నాట్స్ అంటే సేవ, భాష.. ఈ రెండు పదాలు గుర్తుకువస్తాయి. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలబడేందుకు 2009లో ఈ ఆర్గనైజేషన్ స్థాపించాం. మా సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ వేడుకల్లో 10 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాం అన్నారు.
కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ.. తెలుగు భాష చాలా గొప్పది, అలాంటి భాషను కాపాడుకుంటూ మన సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలనే ప్రయత్నం నాట్స్ ద్వారా చేస్తున్నాం. మన నాట్స్ సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం నభూతో న భవిష్యతి అనేలా చేయబోతున్నాం అన్నారు. నటి జయసుధ మాట్లాడుతూ.. నాట్స్ గత తెలుగు సంబరాలకు కూడా నన్ను ఆహ్వానించారు. అయితే మా మదర్ చనిపోవడం వల్ల వెళ్లలేకపోయాను. ఈ సారి తప్పకుండా వెళ్తాను. ఇటీవల నేను ఇంగ్లీష్ మూవీలో నటించాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు నాట్స్ తెలుగు సంబరాలు జరిగే ప్లేస్ కు దగ్గరలోనే జరిగింది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - నాట్స్ గత తెలుగు సంబరాలు ఈవెంట్ లో నేను పాల్గొన్నాను. ఇప్పుడు సెకండ్ టైమ్ వారికి కన్సర్ట్ చేయబోతున్నా. నాతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా కన్సర్ట్ లో పాల్గొంటాడు. సంగీత విభావరితో పాటు జూలై 1,2,3 తేదీల్లో క్రికెట్ టోర్నమెంట్ ఆడబోతున్నాం. నాట్స్ 11 టీమ్ మేము మరో టీమ్ పోటీ పడుతున్నాం. అఖిల్, సుధీర్ బాబు.. ఇలా మా టీమ్ అంతా మ్యాచ్ కు రెడీ అవుతున్నాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment