house purchased
-
లండన్‌లో కొత్త ఇల్లు?
లండన్‌లో ప్రభాస్ ఓ ఇంటిని కొనుగోలు చేశారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వెకేషన్ లేదా సినిమా షూటింగ్‌ల కోసం లండన్ వెళ్లినప్పుడు అక్కడ నివాసం ఉండేలా ప్రభాస్ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. ఇప్పుడు అదే ఇంటిని ప్రభాస్ సొంతం చేసుకున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. లండన్‌లోని ప్రభాస్ ఇల్లు లావిష్‌గా ఉంటుందని, తన అభిరుచికి తగ్గట్లుగా గ్రాండ్‌గా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజాసాబ్’ చిత్రీకరణలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. అలాగే వేసవి తర్వాత ‘సలార్’ మలి భాగం ‘సలార్: శౌర్యంగా పర్వం’ చిత్రీకరణలో ΄ాల్గొననున్నారు ప్రభాస్. ఇంకా మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేస్తారని తెలిసిందే. ఈ ΄ాత్ర చిత్రీకరణ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. -
మీరు ఇల్లు కొంటున్నారా? ఇవీ తెలుసుకోకపోతే భారీ నష్టం!
స్థిరాస్థులైన ఇళ్లు, అపార్ట్మెంట్లు, వ్యవసాయ క్షేత్రాల్ని కొనుగోలు చేస్తుంటాం. ఆ కొనుగోళ్ల సమయంలో తక్కువ రేటు, మంచి ప్రాంతం, అన్నీ వసతులు ఉన్నాయా? లేవా?.. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు భవిష్యత్‌లో ఎంత పెరుగుతాయి’ అనే తదితర విషయాల గురించి ఆరా తీస్తుంటాం. అన్నీ బాగుంటే మన బడ్జెట్‌కు తగ్గట్లు సొంతం చేసుకుంటాం. అదే సమయంలో మీరో విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోతారని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. స్థిరాస్థులపై ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీని తల్లి లేదా భార్య, కుమార్తె పేరు మీద కొనుగోలు చేస్తే ట్యాక్స్ బెన్ఫిట్స్, స్టాంప్ డ్యూటీ, డిస్కౌంట్‌కే వడ్డీ రేట్లను పొందవచ్చు. ఒకవేళ ప్రాపర్టీని కొనుగోలు చేస్తే భార్య, కుమార్తె పేరుమీద కొనుగోలు చేయాలని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల వారీగా ప్రాపర్టీ కొనుగోళ్లతో స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఉదాహరణకు హర్యానాలో స్థిరాస్థులు మహిళలపై కొంటే స్టాంప్ డ్యూటీ 2శాతం చెల్లించాలి. అదే పురుషుడి పేరుమీద ఉంటే 7 శాతం కట్టాలి. మిగిలిన రాష్ట్రాల్లో 5శాతం చెల్లించాలి. ఇద్దరి (భార్య - భర్త) పొత్తులో ఓ ప్రాపర్టీపై పెట్టుబడులు పెడితే.. స్టాంప్ డ్యూటీ 1శాతం తగ్గుతుంది. లక్షల్లో ఆదా ఢిల్లీలో రూ.50 లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఆస్తిని మీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే ఏడు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీ భార్య లేదా తల్లి పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేస్తే ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా, లక్షల్లో రిజిస్ట్రేషన్ ఖర్చుల్ని ఆదా చేసుకోవచ్చు. అదే ఆస్తిని భార్య పేరు మీద మాత్రమే కాకుండా భర్త పేరుమీద జాయింట్‌గా కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఒక శాతం రాయితీ పొందవచ్చు. దీనివల్ల రూ.50,000 ఆదా అవుతుంది. త్వరగా బ్యాంక్ లోన్లు అంతేకాదు మహిళల పేరుమీద ఆస్తిని కొనుగోలు చేస్తే ఇంటి రుణాలు త్వరగా వస్తాయి. బ్యాంకులు సాధారణంగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు అందిస్తాయి. పనిచేసే మహిళ లేదా మహిళా వ్యాపారవేత్తలు గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తే, ఆమె ఆదాయాన్ని తన భర్త ఆదాయంతో కలిపి రుణాన్ని ఎక్కువగా ఇస్తారు. కలపవచ్చు, ఫలితంగా అధిక రుణ మొత్తం వస్తుంది. చివరిగా : కాబట్టి స్థిరాస్థుల కొనుగోలు చేసే సమయాల్లో సంబంధిత నిపుణులు సలహాలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అందుకు ప్రతిఫలంగా కొద్ది మొత్తంలో ఫీజు రూపంలో చెల్లించాలి. చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? -
Capital Gains : ఇళ్లను కొనుగోలు చేసి.. వాటిని లాభాలకు అమ్ముతున్నారా?
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్‌కి సంబంధించి మార్పులు వచ్చాయి. ఇవన్నీ 2023 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మీకు అవసరం అనిపిస్తే లేదా ఉపయోగం అనిపిస్తే 2023 మార్చి 31లోగా ఏదైనా ప్లానింగ్ చేసుకోవచ్చు. మిగతా అన్ని పెట్టుబడుల కన్నా ఇంటి మీద పెట్టుబడి సురక్షితమనే భావన ఉంది. భద్రత, లాభం ఎక్కువ. స్టాక్ మార్కెట్‌లాగా ఒక రోజులో కుదేలవడం.. ఆవిరి అయిపోవడంలాంటివి వంటి ప్రమాదాలు ఉండవనే ఆలోచనతో ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇల్లు కొని, కొన్నేళ్ల తర్వాత అమ్మేసి ఆ మొత్తంతో మరొక ఇల్లు కొని మినహాయింపులూ పొందుతుంటారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట ప్రకారం ఒక ఇల్లు కొని అమ్మితే ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాల్ని మినహాయింపు పొందాలంటే నిర్దేశిత వ్యవధిలో మరో ఇల్లు కొనాలి .. లేదా నిర్దేశిత బాండ్లలో వ్యవధిలోగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ మినహాయింపు మన దేశంలో ఆస్తి కొంటేనే వర్తిస్తుంది. ఇలా చేసే వరకు క్యాపిటల్ గెయిన్ స్కీమ్ ద్వారా బ్యాంకుల్లో అకౌంటు తెరవాలి. ఈ అంశాలకు సంబంధించి ఎన్నో ఉదాహరణలు గతంలో మనం ప్రస్తావించాం. పెద్ద మార్పు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఈ మినహాయింపు మీద ఆంక్షలు వర్తించబోతున్నాయి. సాధారణంగా ఏదో విధి లేక ఇల్లు అమ్మి.. మళ్లీ కొనుక్కునే వారికి మినహాయింపు ఉంటుంది. ఇది సమంజసమే అయినా క్రమేణా ఇదొక అలవాటుగా మారిపోయింది. ప్రజలు వ్యాపార ధోరణిలో పడ్డారు. కొత్త పుంతలు తొక్కుతున్నారు. విల్లాలు, విలాసవంతమైన భవనాలు, అద్దాల మేడలు, పెద్ద భవంతులవైపు మళ్లుతున్నారు. ఇది ‘‘అవసరం’’ నుండి ‘‘అసమంజసం’’ లేదా ‘‘ఆధునికం’’, ‘‘ఆనందం’’ దాటేసి పరుగెడుతోంది. మినహాయింపు ఉందని విలాసవంతమైన ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, 2023 ఏప్రిల్ 1 నుండి ఈ మినహాయింపు మీద మార్పులు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఇక నుంచి ఈ మినహాయింపు రూ.10 కోటి దాటి ఇవ్వరు. మీరు ఇంటి మీద అంతకు మించి ఇన్వెస్ట్ చేసినా .. నిర్దేశిత పరిమితి దాటిన మొత్తానికి ఎటువంటి మినహాయింపు ఇవ్వరు. సెక్షన్ 54, 54ఎఫ్‌లకు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు మీకు దీర్ఘకాలిక మూలధన లాభం రూ.11 కోట్లు అనుకోండి. మీరు రూ. 11 కోట్లు పెట్టి భవంతి కొన్నా కేవలం రూ. 10 కోట్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి .. అదనపు రూ. 1 కోటిపై పన్ను విధిస్తారు. తస్మాత్ జాగ్రత్త! -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్
ముంబై: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇటీవలే కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతం అన్నీబీసెంట్ రోడ్డులో ఉన్న లగ్జరీ టవర్లలో త్రీసిక్స్టీ వెస్ట్ ఒకటి. ఇందులోని పెంట్‌హౌస్ ఖరీదు రూ.240 కోట్లు. టవర్ 63, 64, 65 ఫోర్లలోని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెంట్ హౌస్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను గత బుధవారం బీకే గోయెంకా పూర్తి చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంటని పేర్కొంది. దీనిని ఆనుకునే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను కూడా నిర్మాణ సంస్థ యజమాని వికాస్ ఒబెరాయ్ రూ.240 కోట్లు పెట్టి కొన్నట్లు ఆ కథనంలో వివరించింది. -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
డ్రైవర్, పనిమనిషికి హీరోయిన్ భారీ సాయం
బాలీవుడ్ తాజా సెన్సేషన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం అలియా సొంతం. సినీ ప్రయాణం ప్రారంభించి కొద్ది కాలమే అవుతున్నా.. క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు అలియా. కథల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా ఉండే అలియా.. వరుస విజయాలతో దూసుకుపోతుంది. అందమే కాక అంతకు మించి మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు అలియా. ఈ మధ్యే 26వ పుట్టిన రోజు జరుపుకున్న అలియా.. ఈ సందర్భంగా తన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్‌కు చెరో 25 లక్షల రూపాయల సాయం చేశారనే వార్తలు ప్రస్తుతం బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. డ్రైవర్ సునీల్, వ్యక్తిగత సహాయకుడు అన్మోల్కు కలిపి రూ.50 లక్షల ఖరీదైన చెక్‌ను ఇచ్చారట అలియా. వారు సొంత ఇంటిని కొనుక్కునేందుకు గానే ఈ మొత్తాన్ని సాయం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరు జుహూ, ఖాన్ దందా ప్రాంతంలో ఇళ్లను బుక్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుంచి వీరు ఇద్దరు తన దగ్గరే పని చేస్తున్నారని.. వారి పట్ల తనకు గల ప్రేమను, కృతజ్ఞతను చాటుకోవడానికి అలియా ఇలా చేశారని తెలిసింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అలియా కళంక్, బ్రహ్మస్త్ర చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
బాయ్‌ఫ్రెండ్స్ గిఫ్ట్లమ్మి ఇల్లు కొనేసింది
బుర్రలో విషయం ఉన్నోళ్లు ఎడారిలో సైతం ఇసుక అమ్మగలరు. అతి తెలివి తేటలున్నోళ్లు తిమ్మిని బమ్మిని చేసేసి బతికేస్తుంటారు. చైనాలోని ఓ అమ్మడు ఐఫోన్లతో ఏకంగా ఇల్లు కొనేసింది. బాయ్‌ఫ్రెండ్స్ ఇచ్చిన ఐఫోన్లను అమ్మేసి ఎంచక్కా సొంతిల్లు సమకూర్చుకుంది. ఈ విషయాన్ని ఆమె సహోద్యోగి స్వయంగా చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చైనాలో ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయడం పిచ్చిగా మారిందనడానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. షియోలీ(ఇది అసలు పేరు కాకపోవచ్చు) అనే యువతి తన దగ్గర ఉన్న 20 ఐఫోన్లను ఆన్లైన్లో అమ్మేసి సుమారు రూ.12 లక్షలు పోగేసింది. ఈ డబ్బును డౌన్‌పేమెంట్‌గా చెల్లించి ఇల్లు కొనుక్కుంది. షియోలీకి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె సహోద్యోగి ఒకరు ‘తియాన్ యా యి డూ’ బ్లాగ్ ద్వారా ఫ్రౌడ్ ఖియొబా పేరుతో వెల్లడించాడు. వాళ్లందరి నుంచి ఐఫోన్ 7 గిఫ్ట్‌గా ఆమె తీసుకుందని తెలిపాడు. చైనాకు వలసవచ్చిన కుటుంబంలో జన్మించిన ఆమె ముందుచూపుతోనే ఇల్లు కొనుక్కుని ఉండవ చ్చని అభిప్రాయపడ్డాడు. అయితే అమె ఇల్లు కొనుక్కున్న పద్ధతే తనకు నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యపోయాడు. ఈ విషయం గురించి తెలియగానే షియోలీ కొనుక్కున్న ఇల్లు చూడాలని, ఆమె డబ్బు ఎలా కూడబెట్టిందో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారని వెల్లడించాడు. షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వెంటపడింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. షియోలీ స్టోరీ ‘20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్’ హ్యాష్ టాగ్‌తో సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున షేర్ చే శారు. కొంతమంది ఆమెను ప్రశంసిస్తే, మరికొంత మంది ఆమెను తిట్టిపోశారు.