
ముంబై: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇటీవలే కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతం అన్నీబీసెంట్ రోడ్డులో ఉన్న లగ్జరీ టవర్లలో త్రీసిక్స్‌టీ వెస్ట్ ఒకటి. ఇందులోని పెంట్‌హౌస్ ఖరీదు రూ.240 కోట్లు.
టవర్ 63, 64, 65 ఫోర్లలోని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెంట్ హౌస్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను గత బుధవారం బీకే గోయెంకా పూర్తి చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంటని పేర్కొంది. దీనిని ఆనుకునే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను కూడా నిర్మాణ సంస్థ యజమాని వికాస్ ఒబెరాయ్ రూ.240 కోట్లు పెట్టి కొన్నట్లు ఆ కథనంలో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment