Times of India
-
యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది : జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆయనకే కాదు, అంతర్జాతీయంగాను భారత్ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు జెలెన్స్కీ ఇటీవల ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ జోక్యంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు జెలెన్స్కీ..‘ప్రధాని మోదీ దీనిని నిజం చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు భారత్‌లోనే చర్చలు జరగొచ్చు. అయితే, యుద్ధం మా గడ్డపై జరుగుతున్నందున మేమిచ్చే షరతులకు లోబడే సంప్రదింపులు జరగాలి’అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయతి్నస్తానన్న మోదీ ప్రకటనపై జలెన్ స్కీ..మాటలు కాదు, చేతలు అవసరమన్నారు. ‘జనాభాపరంగా, ఆర్థికంగా, పలుకుబడిపరంగా భారత్ పెద్ద దేశం. అలాంటి దేశానికి ప్రధాని అయిన మోదీ..యుద్ధాన్ని ఆపేందుకు ప్రయతి్నస్తామని కేవలం మాటగా చెప్పడం సరికాదు. యుద్ధాన్ని ఆపేందుకు పలుకుబడిని ఉపయోగించాలి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఆదేశం నుంచి చౌకగా దొరుకుతున్న చమురును, రక్షణ రంగ ఉత్పత్తులను కొనరాదు. ఫలితంగా ఆ దేశ యుద్ధ సామర్ధ్యం దెబ్బతింటుంది’అని తెలిపారు. యుద్ధం సమయంలో ఎత్తుకుపోయిన మా చిన్నారుల్లో కనీసం వెయ్యి మందినైనా తిరిగి మాకు ఇచ్చేలా మోదీ రష్యాపై తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. తటస్థత అంటే రష్యా వైపు ఉన్నట్టే ‘యుద్ధం జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉండటమంటే రష్యా పక్షాన ఉన్నట్లే అర్థం. దురాక్రమణదారు, బాధిత దేశం మధ్య తటస్థత అనేదే ఉండదు. అలా ఉండటమంటే పరోక్షంగా రష్యాకు మద్దతివ్వడమే’అని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొన్న నేతలు కూడా సంక్షోభం సమసేందుకు సహకరిస్తామని చెప్పారు. నా దృష్టిలో అది కూడా మాకంటే రష్యాకే ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నా’అన్నారు. ‘అంతేకాదు, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాల నేతలు రానందున బ్రిక్స్ శిఖరాగ్రం విఫలమైనట్లే లెక్క. ప్రపంచాన్ని పుతిన్ పశి్చమ అనుకూల, బ్రిక్స్ అనుకూల దేశాలుగా విభజించాలనుకుంటున్నారు. అందుకే, బ్రెజిల్, చైనాలు తీసుకువచి్చన శాంతి ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. ఈ పరిణామం చైనా, బ్రెజిల్‌లకు చెంపపెట్టు వంటిది’అని చెప్పారు. -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్
ముంబై: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇటీవలే కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతం అన్నీబీసెంట్ రోడ్డులో ఉన్న లగ్జరీ టవర్లలో త్రీసిక్స్టీ వెస్ట్ ఒకటి. ఇందులోని పెంట్‌హౌస్ ఖరీదు రూ.240 కోట్లు. టవర్ 63, 64, 65 ఫోర్లలోని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెంట్ హౌస్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను గత బుధవారం బీకే గోయెంకా పూర్తి చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంటని పేర్కొంది. దీనిని ఆనుకునే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను కూడా నిర్మాణ సంస్థ యజమాని వికాస్ ఒబెరాయ్ రూ.240 కోట్లు పెట్టి కొన్నట్లు ఆ కథనంలో వివరించింది. -
హైదరాబాద్‌ను టాప్–25లో ఒకటిగా చేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచంలోనే టాప్–25 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే తెలంగాణలోనూ నగరీకరణ పెరుగుతోందని, రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే.. రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర నగరాలున్నాయన్నారు. ఈ చిన్న భౌగోళిక ప్రాంతంలోనే 46.8 శాతం జనాభా కేంద్రీకృతమై ఉండటం వల్ల తగిన మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారిందని తెలిపారు. మంగళవారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రిక నిర్వహించిన ‘రీప్లానెట్ ఇనీషియేటివ్’ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పర్యావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశంపై ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత పచ్చదనం కలిగిన నగరంగా ఇప్పటికే గుర్తింపు పొందిందన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటితో సంతృప్తి పడరాదని, టాప్–25 నగరాల్లో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా తాము పలు చర్యలు చేపట్టామన్నారు. శుద్ధి చేసిన నీరు భవన నిర్మాణాలకు... హైదరాబాద్‌ను మరింత పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. వచ్చే మార్చి, ఏప్రిల్‌కల్లా నగరంలో రోజూ ఉత్పత్తయ్యే 1,259 ఎంఎల్డీ మురుగునీటిని శుద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా రెండవ దశ శుద్ధీకరణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాల్లో, ల్యాండ్‌స్కేపింగ్, హార్టికల్చర్ రంగాల్లో ఉపయోగిస్తామన్నారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో కొలుములను చల్లబరిచేందుకూ వాడుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 68 కేంద్రాలు పూర్తికాగా మిగిలినవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. పొడి చెత్తతో విద్యుదుత్పత్తికి మరో రెండు కేంద్రాలు నగరాల్లో వరదనీటిని వృథా పోనివ్వకుండా ఉండేందుకు పుణే కేంద్రంగా పనిచేస్తున్న షా కన్సల్టెంట్స్తో హైదరాబాద్ నగరాన్ని సర్వే చేయించామని, వరదనీటి ప్రవాహం తీరుతెన్నులు, నీటి నిల్వకు అవకాశమున్న ప్రాంతాలన్నింటినీ మ్యాప్ చేశామని కేటీఆర్ తెలిపారు. అలాగే నగరంలో రోజూ వెలువడుతున్న సుమారు 6,000 టన్నుల చెత్తలో పొడి చెత్త ద్వారా విద్యుదుత్పత్తికి 20 మెగావాట్ల కేంద్రం ఒకటి ఇప్పటికే ఉండగా.. మరో 28 మెగావాట్ల కేంద్రం తయారవుతోందని, ఇంకో 20 మెగావాట్ల కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. నగరంలో దాదాపు 218 వారసత్వ కట్టడాలు ఉన్నాయని వీటన్నింటికీ పూర్వవైభవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బన్సీలాల్‌పేట మెట్ల బావి పునరుద్ధరణ మచ్చుకు ఒకటి మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ రాబిన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. సీఎం జగన్ అభినందన
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన మరో ప్రతిష్టాత్మక అవార్డుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో ఏపీకి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. తద్వారా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఢిల్లీలో అవార్డు అందుకున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదిలా ఉంటే.. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి అవార్డు గురించి వివరించారు మంత్రి అమర్నాథ్. ఈ సందర్భంగా మంత్రిని సీఎం జగన్ అభినందించారు. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల కల్పన విభాగంలో దేశంలోనే ఆంధప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ అవార్డుకి ఎంపిక చేసింది. పెద్ద ఎత్తున పోర్టులను నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని.. అవార్డు కమిటీ సభ్యులు ప్రశంసించారు కూడా. -
ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె. సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవార్డుకి ఎంపిక చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకోనున్నారు. చదవండి: (లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్) -
Indu Jain: టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ కన్నుమూత
ముంబై: కరోనా వైరస్ దేశంలో వినాశనం సృష్టిస్తూనే ఉంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఈ వైరస్ సామాన్యులతో పాటు వేలాది మంది ప్రముఖులను సైతం పొట్టన బెట్టుకుంటోంది. తాజాగా టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్(84) కరోనా మహమ్మరి బారినపడి గురువారం కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్జీవోగా తీర్చిదిద్దారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రధాని మోదీ సంతాపం ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూజైన్ మృతి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందూ జైన్ సమాజ సేవా కార్యక్రమాలు, భారతదేశం పురోగతి పట్ల అభిరుచి, సంస్కృతిపై ఆసక్తి ఉన్న వ్యక్తి అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇందూ జైన్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాని మోదీ తెలిపారు. అమె మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. Saddened by the demise of Times Group Chairperson Smt. Indu Jain Ji. She will be remembered for her community service initiatives, passion towards India’s progress and deep-rooted interest in our culture. I recall my interactions with her. Condolences to her family. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 13, 2021 చదవండి: ఆక్సిజన్ అందక మరో 15 మంది మృత్యువాత -
‘హోదా’ ఎవరిస్తే వారికే మా మద్దతు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో పూర్తి మెజారిటీనే కట్టబెడతారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో విజయంపై మాకు ఎలాంటి ఢోకా లేదు. చంద్రబాబు ప్రభుత్వంపై అసమ్మతి తారస్థాయిలో ఉన్నందున్న వైఎస్సార్ సీపీకి 2019 ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చే ప్రశ్నేలేదు. తొమ్మిదేళ్ల పాలనానుభవం కలిగినప్పటికీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రజలకు ఏమీ చేయని ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను పూర్తిగా మార్చివేయబోతున్నాం. ప్రధానమంత్రి మోదీనా లేక రాహుల్ గాంధీనా అనేది ముఖ్యం కాదు. ప్రత్యేక హోదాను ఎవరు ఇస్తే వారినే బలపరుస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదానే ప్రాణాధారం. 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో మీ విజయావకాశాలపై మీ అంచనా ఏమిటి? 2014 ఎన్నికల నాటికి చంద్రబాబు అధికారంలో లేడు కనుక ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆయనపై ఉండే అవకాశం లేదు. పైగా బీజేపీ, పవన్ కల్యాణ్ టీడీపీ ఎన్నికల చిహ్నమైన సైకిల్‌కి రెండు చక్రాలుగా వ్యవహరించారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ, టీడీపీ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లలో తేడా కేవలం 1.5 శాతం మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రైతులు పంట ధరల విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. బ్యాంకులకు రైతుల రుణ బకాయిలు ప్రస్తుతం రూ. 1,26,000 కోట్లకు చేరుకున్నందున రుణమాఫీ పథకం ఒక ప్రహసనంలా తయారైంది. గత నాలుగేళ్లలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చానని, 20 లక్షల ఉద్యోగాలను సృష్టించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవం పూర్తి భిన్నంగా ఉంది. కాబట్టి ఈసారి మేం పరిస్థితులను పూర్తిగా మార్చి వేయబోతున్నాం. బీజేపీతో పొత్తునుంచి చంద్రబాబు బయటపడటంపై మీరేమనుకుంటున్నారు? తన వైఫల్యాలన్నింటికీ ఎవరో ఒకరిని తప్పుపట్టాలని చంద్రబాబు కోరుకున్నారు. ఈ విషయంలో బీజేపీ బాబుకు లడ్డూలాగా దొరికింది. ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలుగా లబ్ధి పొందిందని చంద్రబాబు 2016 జనవరి 27న బీజేపీని ప్రశంసించారు. ఒక నెల తర్వాత కేంద్ర బడ్జెట్ ఆమోదం పొందినప్పుడు కూడా బాబు తన అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇక 2016 సెప్టెంబర్ 8న టీడీపీ ఎంపీల సమక్షంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. చంద్రబాబుతో సంప్రదించిన తర్వాతే ప్యాకేజీని ఖరారు చేశారని స్పష్టంగా సూచనలు వచ్చాయి. వెంటనే, ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రత్యేక ప్యాకేజీకి స్వాగతం పలికి, ఆ మేరకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఆమో దింపజేశారు కూడా. ఇప్పుడు బీజేపీతో తెగ తెంపులు చేసుకోవడం ద్వారా బాబు తన వైఫల్యాన్నింటికీ బీజేపీని తప్పుబడుతున్నారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం దీన్ని బాగానే అర్థం చేసుకున్నారు. రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్ కోవింద్‌ని ప్రకటించినప్పుడు మీరు ఎన్డీఏకి మద్దతు పలికారు కదా? వాస్తవానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరే కంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది మేమే. ఆ తర్వాతే టీడీపీ ముందుకొచ్చింది. మాతో చేతులు కలపాలని మేం వారిని కోరాం. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మొత్తంగా రాజీనామా చేసి ఉంటే, అది యావద్దేశానికీ ప్రత్యేక హోదా (ఎస్సీఎస్) అంశంపై బలమైన సందేశం పంపి ఉండేది. ఒకవేళ లోక్‌సభలో మా అయిదుగురు ఎంపీలూ కొనసాగి ఉన్నా, టీడీపీ ఈమధ్యే ప్రతి పాదించిన అవిశ్వాస తీర్మానాన్ని బలపర్చి ఉండే వాళ్లం. అయితే, బీజేపీ, టీడీపీ రెండూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేశాయి. ఈ రెండుపార్టీలు తమ మ్యానిఫెస్టోలలో హోదాను ప్రస్తావించి తర్వాత వెన్నుపోటు పొడిచాయి. ప్రత్యేక హోదాను ఇచ్చి ఉంటే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎలా ఉండేది? ప్రత్యేక హోదా హామీతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. ప్రత్యేక హోదాతో ఆదాయ పన్ను, జీఎస్టీలపై పూర్తి మినహాయింపు వచ్చి ఉండేది. హోదానే వచ్చి ఉంటే పరిశ్రమలూ, హోటళ్లూ, ఆసుపత్రులూ రాష్ట్రానికి వెల్లువలా వచ్చి ఉండేవి. ప్రత్యేక హోదా లేని ఆంధ్రప్రదేశ్ శూన్యమే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై... సాపేక్షంగా అభివృద్ధి చెందినందున ఈ మూడు నగరాలూ ఏపీకి భిన్నంగా మదుపుదారులందరినీ ఆకర్షిస్తాయి. అందుకే ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు ప్రత్యేక హోదా ప్రాణాధారం వంటిది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ సీట్లు మీకే వచ్చి, ఎన్డీఏ, యూపీఏ రెండింటికీ సాధారణ మెజారిటీకి తక్కువ సీట్లు వచ్చాయనుకోండి, మీరు ఎవరిని బలపరుస్తారు? మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ప్రధానమంత్రి మోదీనా లేక రాహుల్ గాంధీనా అనేది మాకు ప్రాధాన్యం కాదు. ప్రత్యేక హోదాను ఎవరు ఇస్తే వారినే మేం బలపరుస్తాం. తాను గెలిస్తే హోదా ఇస్తానని కాంగ్రెస్ చెబుతోంది. కానీ గతానుభవం దృష్ట్యా, మేం ఎవరినీ నమ్మలేం. ఏ పార్టీవారైనా సరే ముందుగా అధికారం లోకి వచ్చి ప్రత్యేక హోదాను ప్రకటిస్తే మేం మద్దతు ఇస్తాం. వైఎస్సార్ సీపీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు కదా? మేం ఎవరి పక్షానా లేం. మేం ఎల్లప్పుడూ అంశాల వారీగానే మద్దతిచ్చాం. నిజానికి, మేం భూసేకరణ బిల్లు విషయంలో బీజేపీని వ్యతిరేకించాం. రాజ్యాంగబద్ధ పదవులకు ఎన్నికలు ఉండకూడదనే ఉద్దేశంతోనే మేం ఎన్డీయే తరపున అధ్యక్షపదవికి నామినీగా ఉన్న రామ్ నాథ్ కోవింద్‌కు మద్దతిచ్చాం. అలాగే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌పదవికి టీడీపీ నామినీ అయిన కోడెల శివప్రసాదరావుకు కూడా మద్దతి చ్చాం. వాస్తవానికి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో కాపురంచేస్తూ వస్తోంది చంద్రబాబే. మీకు పాలనాపరమైన అనుభవం లేదని మీ ప్రత్య ర్థులు చెబుతున్నారు కదా? నేను రెండుసార్లు ఎంపీగా గెలిచాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉంటున్నాను. ప్రజాజీవితంలో నా పదేళ్ల అనుభవాన్ని ఎవరైనా ఎలా తగ్గించి చూపుతారు? ఇప్పుడు పాదయాత్ర విషయానికి వస్తే, నేను నా కుటుంబం కంటే ఎక్కువ సమయం ప్రజలతోనే గడుపుతున్నాను. మరోవైపున తొమ్మి దేళ్ల పాలనానుభవం కలిగిన చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే ప్రజలకు ఏమీ చేయని ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ మెజారిటీకంటే తక్కువ స్థానాలు మీకు వచ్చి, బీజేపీ ఏపీలో కొన్ని స్థానాలు గెల్చుకున్నట్లయితే, మీరు ఆ పార్టీ మద్దతు తీసుకుంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవిధంగా ఓట్లు వేసిన చరిత్ర లేదు. వారు పూర్తి మెజారిటీ అయినా ఇస్తారు లేదా అసలు ఇవ్వరు. అందుచేత, రాబోయే శాసనసభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి తక్కువ స్థానాలు మాకు వచ్చే ప్రశ్నే అసలు తలెత్తదు. (శుక్రవారం (17–08–2018) నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటర్వ్యూను యధాతథంగా సాక్షి పాఠకులకు అందిస్తున్నాం) -
‘ఆపరేషన్ శక్తి’ సాగిందిలా!
పోఖ్రాన్ పరీక్షలు.. భారతదేశం తన అణు పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భమది. తొలిసారి 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పోఖ్రాన్–1 పేరిట ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్‌తో అణు పరీక్షలు నిర్వహించగా, 1998లో ప్రధాని వాజ్‌పేయి ఆదేశాలతో ఆపరేషన్ శక్తి(పోఖ్రాన్–2) పేరుతో అణు పరీక్షలు నిర్వహించారు. కానీ 1974తో పోల్చుకుంటే 1998లో అణు పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏకు చెందిన శక్తిమంతమైన ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో నిఘా పెట్టడంతో వ్యూహాత్మకంగా వాటిని బురిడీ కొట్టిస్తూ అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ (రిటైర్డ్) గోపాల్ కౌశిక్ , చేతన్ కుమార్‌లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ చేసింది. నాటి ఆపరేషన్ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై తమ అనుభవాలను వీరిద్దరూ మీడియాతో పంచుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు.. ఈ విషయమై కల్నల్ గోపాల్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘1974తో పోల్చుకుంటే 1998లో ఆపరేషన్ శక్తి సందర్భంగా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి ంది. ఎందుకంటే తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ సామర్థ్యం, ఉద్దేశం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే అణు బాంబును ఎక్కడ పరీక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అవసరమైనన్ని ఉపగ్రహాలు అమెరికా వద్ద అప్పట్లో లేవు. కానీ 1998 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 1995–96లో భారత్ అణు పరీక్షలకు రహస్యంగా చేస్తున్న ఏర్పాట్లు బయటకు పొక్కడంతో అమెరికా సహా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియడంతో శక్తిమంతమైన అమెరికా నిఘా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి’ అని తెలిపారు. ఎదురైన సవాళ్లు ఎన్నో.. అణు పరీక్షల ఏర్పాట్ల సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులపై కౌశిక్ స్పందిస్తూ.. ‘ఈ పరీక్షల ఏర్పాట్లలో శాస్త్రవేత్తలు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా నిలిచింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీలకు పడిపోయేది. అంతేకాకుండా ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లు ఉండేవి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. దీంతోపాటు అణు బాంబుల్ని భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడం మరో తలనొప్పిగా మారింది. విపరీతమైన వేడి ఉన్న ఈ ప్రాంతంలో వర్షపు కోట్ ధరించి అణు బాంబును అమర్చేందుకు తవ్విన గుంతల్లో దిగి పనిచేయడం శాస్త్రవేత్తలు, సైనికులకు ఇబ్బందికరంగా తయారైంది. అలాగే వీటిలో అమర్చిన లోహపు పరికరాలు నీటి ప్రభావంతో తుప్పుపట్టడం మొదలుపెట్టాయి. దీంతో నీటిని బయటకు తోడేద్దామని తొలుత అనుకున్నాం. అయితే నీటి ప్రభావంతో మారిపోయే ఇసుక రంగును, అక్కడ మొలిచే పచ్చికను సైతం విదేశీ నిఘా ఉపగ్రహాలు గుర్తించే వీలు ఉండటంతో మరో మార్గాన్ని అన్వేషించాం. దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటిద్వారా నీటిని పంపింగ్ చేసేవాళ్లం. దీంతో పైకి కన్పించకుండానే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేవి’ అని అన్నారు. ‘తవ్విన గుంతల్లో అణు బాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో సవాలుగా నిలిచింది. ఇసుక బస్తాలను పైనుంచి విసిరేస్తే అణు బాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, అధికారులు చురుగ్గా ఆలోచించారు. ఓ జాలీ లాంటి పరికరంతో బ్యాగుల్ని జారవిడిచే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇలా 6,000 ఇసుక బస్తాలను జారవిడిచేందుకు వారం పట్టే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. చివరికి బిలియర్డ్స్ ఆటలో వినియోగించే క్యూ స్టిక్స్‌తో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంతల్లో పైపుల్ని ఒకదానిపక్కన మరొకటి అమర్చిన అధికారులు, వాటిపై ఇసుక బస్తాలను జారవిడిచారు. ఈ వ్యూహం పనిచేయడంతో ఏర్పాట్లు పూర్తిచేసి 1998 మే 11 నుంచి 13 మధ్య ఐదు అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించాం’ అని తమ అనుభవాలను పంచుకున్నారు. పగలు క్రికెట్.. రాత్రి ఏర్పాట్లు ‘అమెరికా నిఘా ఉపగ్రహాల్ని పక్కదారి పట్టించేందుకు వినూత్నంగా ఆలోచించాం. పోఖ్రాన్ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు పగటిపూట క్రికెట్ ఆడేవారు. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమిగూడేవారు. జనసంచారం ఉండటంతో విదేశీ నిఘా వర్గాలు పోఖ్రాన్లో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంతమాత్రం అనుమానించలేదు. సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయి. కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయోగ పనుల్ని చేపట్టేవారు. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనీల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కదలికల్ని నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వారందరూ సైనిక దుస్తులు ధరించేవారు. అబ్దుల్ కలామ్‌ను మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని, చిదంబరాన్ని మేజర్ నటరాజ్‌గా వ్యవహరించేవారు’ అని కౌశిక్ చెప్పారు. -
మోస్ట్ డిజైరబుల్ లిస్ట్‌లో ప్రభాస్, మహేశ్
సాక్షి, ముంబై: ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు స్థానం దక్కించుకున్నారు. 2017 ఏడాదికి గానూ విడుదల చేసిన జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తొలి స్థానంలో నిలవగా.. ప్రభాస్ రెండో ప్లేస్‌లో నిలిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, సిధార్థ్ మల్హోత్రాలు 3,4,5వ స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 6వ స్థానంలో నిలవగా.. దగ్గుబాటి రానా ఏడో స్థానం దక్కించుకున్నారు. మళయాళం యువ హీరో దుల్కర్ సల్మాన్ 9వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్ యువ మోడల్ బషీర్ అలీ 17వ స్థానం దక్కించుకున్నాడు. పాపులారిటీ, క్రేజ్‌ను ఆధారంగా చేసుకుని మొత్తం 50 మంది పేర్లతో ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ పేరిట టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ జాబితాను విడుదల చేస్తుంటుంది. బాహుబలి సిరీస్ మూలంగా ప్రభాస్ పేరు దేశం మొత్తం పాకిపోగా.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. వచ్చే ఏడాది సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియా బిగ్ ఫైట్!
బాలీవుడ్ తార దీపికా పదుకొనె, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. గత కొద్దికాలంగా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియాలు ఒకరిపై కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీపికా పాయింట్ ఆఫ్ వ్యూ: నా ప్రొఫెషన్ కు నేను కొత్తేమి కాదు. పాత్రలు డిమాండ్ మేరకు తాను నడుచుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా దుస్తులు ధరించాల్సి రావోచ్చు. లేదా నగ్నంగా నటించాల్సి రావొచ్చు. అలాంటి పాత్రలు ధరించాలా వద్దా అనే విషయంపై తన ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. అయితే పాఠకుల దృష్టిని ఆకర్షించేందుకు ఒక రకమైన సిద్దాంతాన్ని పెట్టుకుని నాసిరకమైన ఎత్తులతో మహిళ గౌరవాన్ని దిగజార్చడం పద్దతి కాదు. ఎన్నడైనా పురుషుడి, మహిళ శరీరంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా.. షారుక్ 8 ప్యాక్ గురించి తప్పుడు పద్దతిలో కథనాన్ని ప్రచురించారా అంటూ తాజాగా దీపికా పదుకొనె ఫేస్ బుక్ లో ఓ వ్యాసాన్ని రాశారు. రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు చాలా వ్యత్యాసం ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్ లైన్ కోట్ చేసింది. హెడ్ లైన్ ద్వారా అమ్ముకోవడానికి మహిళల వక్షోజాలను, పురుషాంగాలను, ఇతర శరీర భాగాలను ఎంపిక చేసుకోవడం సమర్ధనీయమా అంటూ ప్రశ్నించారు. ఫేస్ బుక్ లో దీపికా పోస్ట్ కు జవాబుగా..పాయింట్ ఆఫ్ వ్యూ: మీ రీల్, రియల్ లైఫ్ వాదనను మేము అంగీకరిస్తున్నాం. చాలా రోజులుగా తెరమీద కాకుండా బయట అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో డాన్యులు చేయడం, మ్యాగజైన్ కవర్ కు ఫోజులివ్వడం లాంటి కనిపిస్తున్నాయి.అక్కడ నీవు ఏలాంటి రోల్ లో నటిస్తున్నారు? ఎందుకు ఆ హిపోక్రసీ? ఇంతకు ముందు ఇతర మీడియా సంస్థలు నీ వక్షోజాలతో ఫోటోలు పోస్ట్ చేశారు. అప్పుడు అడ్డు చెప్పని నీవు.. ఇప్పుడే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అంటూ ఫేస్ బుక్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా కౌంటర్ ఇచ్చారు. సెక్సీ షారుక్ ఖాన్ 8 ప్యాక్ అంటూ హెడ్ లైన్ పెట్టలేం కదా అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఎవరి అభిప్రాయాలను చెప్పుకోవడానికి వారికి హక్కు ఉంటుంది? ఈ వివాదాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్లి ఆకర్షణీయమైన హెడ్ లైన్ తో ప్రాముఖ్యం లేని హెడ్ లైన్ అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాను. మీ ఇంటర్వ్యూలు ట్వీట్ చేయడం చూస్తున్నాం. అదీ మీ పబ్లిసిటీకి, మీ సినిమాల ప్రమోషన్ కు బాగా ఉపయోగపడ్డాయి. యూట్యూబ్ లో ఉన్న మీ వీడియోలపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా మీకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోగ్రాఫులు మీడియాలో రావడంపై మా మీడియా మిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. గత కొద్ది రోజుల క్రితం దీపికా పదుకొనె వక్షోజ ప్రదర్శన చేసిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెబ్ సైట్ ఓ కథనాన్నిప్రచురించింది. ఆ కథనంపై స్పందిస్తూ.. నేను మహిళను, నాకు వక్షోజాలు ఉన్నాయి.. మీకు వచ్చిన సమస్యేమిటి?. మహిళను గౌరవించడం చాతకాకపోతే.. మహిళా చైతన్యం అంటూ మాట్లాడవద్దు అంటూ దీపిక ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్దం ఎక్కడికి దారి తీస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనానికి దీపికా మళ్లీ కౌంటర్ ఇస్తుందా లేక ఇంతటి ఆగుతుందా అనే వేచి చూడాల్సిందే.