దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియా బిగ్ ఫైట్!
దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియా బిగ్ ఫైట్!
Published Mon, Sep 22 2014 1:00 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
బాలీవుడ్ తార దీపికా పదుకొనె, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. గత కొద్దికాలంగా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియాలు ఒకరిపై కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు.
దీపికా పాయింట్ ఆఫ్ వ్యూ:
నా ప్రొఫెషన్ కు నేను కొత్తేమి కాదు. పాత్రలు డిమాండ్ మేరకు తాను నడుచుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా దుస్తులు ధరించాల్సి రావోచ్చు. లేదా నగ్నంగా నటించాల్సి రావొచ్చు. అలాంటి పాత్రలు ధరించాలా వద్దా అనే విషయంపై తన ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. అయితే పాఠకుల దృష్టిని ఆకర్షించేందుకు ఒక రకమైన సిద్దాంతాన్ని పెట్టుకుని నాసిరకమైన ఎత్తులతో మహిళ గౌరవాన్ని దిగజార్చడం పద్దతి కాదు. ఎన్నడైనా పురుషుడి, మహిళ శరీరంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా.. షారుక్ 8 ప్యాక్ గురించి తప్పుడు పద్దతిలో కథనాన్ని ప్రచురించారా అంటూ తాజాగా దీపికా పదుకొనె ఫేస్ బుక్ లో ఓ వ్యాసాన్ని రాశారు. రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు చాలా వ్యత్యాసం ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్ లైన్ కోట్ చేసింది. హెడ్ లైన్ ద్వారా అమ్ముకోవడానికి మహిళల వక్షోజాలను, పురుషాంగాలను, ఇతర శరీర భాగాలను ఎంపిక చేసుకోవడం సమర్ధనీయమా అంటూ ప్రశ్నించారు.
ఫేస్ బుక్ లో దీపికా పోస్ట్ కు జవాబుగా..పాయింట్ ఆఫ్ వ్యూ:
మీ రీల్, రియల్ లైఫ్ వాదనను మేము అంగీకరిస్తున్నాం. చాలా రోజులుగా తెరమీద కాకుండా బయట అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో డాన్యులు చేయడం, మ్యాగజైన్ కవర్ కు ఫోజులివ్వడం లాంటి కనిపిస్తున్నాయి.అక్కడ నీవు ఏలాంటి రోల్ లో నటిస్తున్నారు? ఎందుకు ఆ హిపోక్రసీ? ఇంతకు ముందు ఇతర మీడియా సంస్థలు నీ వక్షోజాలతో ఫోటోలు పోస్ట్ చేశారు. అప్పుడు అడ్డు చెప్పని నీవు.. ఇప్పుడే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అంటూ ఫేస్ బుక్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా కౌంటర్ ఇచ్చారు. సెక్సీ షారుక్ ఖాన్ 8 ప్యాక్ అంటూ హెడ్ లైన్ పెట్టలేం కదా అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఎవరి అభిప్రాయాలను చెప్పుకోవడానికి వారికి హక్కు ఉంటుంది? ఈ వివాదాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్లి ఆకర్షణీయమైన హెడ్ లైన్ తో ప్రాముఖ్యం లేని హెడ్ లైన్ అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాను. మీ ఇంటర్వ్యూలు ట్వీట్ చేయడం చూస్తున్నాం. అదీ మీ పబ్లిసిటీకి, మీ సినిమాల ప్రమోషన్ కు బాగా ఉపయోగపడ్డాయి. యూట్యూబ్ లో ఉన్న మీ వీడియోలపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా మీకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోగ్రాఫులు మీడియాలో రావడంపై మా మీడియా మిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది.
గత కొద్ది రోజుల క్రితం దీపికా పదుకొనె వక్షోజ ప్రదర్శన చేసిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెబ్ సైట్ ఓ కథనాన్నిప్రచురించింది. ఆ కథనంపై స్పందిస్తూ.. నేను మహిళను, నాకు వక్షోజాలు ఉన్నాయి.. మీకు వచ్చిన సమస్యేమిటి?. మహిళను గౌరవించడం చాతకాకపోతే.. మహిళా చైతన్యం అంటూ మాట్లాడవద్దు అంటూ దీపిక ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్దం ఎక్కడికి దారి తీస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనానికి దీపికా మళ్లీ కౌంటర్ ఇస్తుందా లేక ఇంతటి ఆగుతుందా అనే వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement