డ్రైవర్‌, పనిమనిషికి హీరోయిన్‌ భారీ సాయం | Alia Bhatt Gifts Rs 50 Lakh To Driver And Helper | Sakshi
Sakshi News home page

ఇళ్లు కొనుక్కునేందుకు సాయం చేసిన అలియా

Published Tue, Mar 19 2019 1:55 PM | Last Updated on Tue, Mar 19 2019 2:07 PM

Alia Bhatt Gifts Rs 50 Lakh To Driver And Helper - Sakshi

బాలీవుడ్‌ తాజా సెన్సేషన్‌ అలియా భట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం అలియా సొంతం. సినీ ప్రయాణం ప్రారంభించి కొద్ది కాలమే అవుతున్నా.. క్రేజీ ఆఫర్స్‌ సొంతం చేసుకుంటున్నారు అలియా. కథల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా ఉండే అలియా.. వరుస విజయాలతో దూసుకుపోతుంది. అందమే కాక అంతకు మించి మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు అలియా.

ఈ మధ్యే 26వ పుట్టిన రోజు జరుపుకున్న అలియా.. ఈ సందర్భంగా తన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్‌కు చెరో 25 లక్షల రూపాయల సాయం చేశారనే వార్తలు ప్రస్తుతం బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. డ్రైవర్‌ సునీల్‌, వ్యక్తిగత సహాయకుడు అన్మోల్‌కు కలిపి రూ.50 లక్షల ఖరీదైన చెక్‌ను ఇచ్చారట అలియా. వారు సొంత ఇంటిని కొనుక్కునేం‍దుకు గానే ఈ మొత్తాన్ని సాయం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరు జుహూ, ఖాన్‌ దందా ప్రాంతంలో ఇళ్లను బుక్‌ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుంచి వీరు ఇద్దరు తన దగ్గరే పని చేస్తున్నారని.. వారి పట్ల తనకు గల ప్రేమను, కృతజ్ఞతను చాటుకోవడానికి అలియా ఇలా చేశారని తెలిసింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అలియా కళంక్‌, బ్రహ్మస్త్ర చిత్రాలతో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement