తల్లిదండ్రులైన రాకింగ్‌ రాకేష్, సుజాత దంపతులు | Rocking Rakesh And Sujatha Became Parents | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులైన రాకింగ్‌ రాకేష్, సుజాత దంపతులు

Published Sat, Oct 5 2024 10:39 AM | Last Updated on Sat, Oct 5 2024 10:50 AM

Rocking Rakesh And Sujatha Became Parents

బుల్లితెర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్‌ రాకేశ్‌, సుజాత తల్లిదండ్రులు అయ్యారు.  ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వారు ప్రకటించారు. అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ జోర్దార్‌ సుజాతగా పేరు తెచ్చుకున్న ఆమె బిగ్‌బాస్‌ షో ఎంట్రీతో మరింత పాపులర్‌ అయింది. అప్పటికే బుల్లితెరపై ప్రముఖ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ రాణిస్తున్నారు. గతేడాది తిరుమలలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

తాము తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్నట్లు రాకింగ్‌ రాకేశ్‌ తెలిపారు. పండండి పాపకు సుజాత జన్మనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ అపురూపమైన క్షణాలు తన జీవితంలో ఒక అద్భుతం అంటూ.. ' జీవితంలో సగ భాగం అయిన సుజాత ఓ బిడ్డకు తల్లిగా ఆనందించే ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్త్రీని గౌరవిద్దాం.. పూజిద్దాం' అంటూ ఆయన ఒక పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఓటీటీలో 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటన

బిగ్‌బాస్‌తో గుర్తింపు వచ్చిన తర్వాత జోర్దార్ సుజాత ఒక కామెడీ షోలో నటించింది. ఈ క్రమంలో  రాకింగ్ రాకేష్‌తో జంటగా ఆమె కొన్ని ప్రొగ్రామ్స్‌ చేసింది. అలా వారి ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి. కొన్నాళ్ల తర్వాత తమ ప్రేమ విష‌యాన్ని బ‌హిరంగంగానే  రాకేష్ చెప్పాడు. అలా 2023 ఫిబ్ర‌వ‌రి 24న తిరుమ‌ల‌లో వారి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement