మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి : మంత్రి హరీశ్‌రావు | - | Sakshi
Sakshi News home page

మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి : మంత్రి హరీశ్‌రావు

Published Sat, Oct 7 2023 4:52 AM | Last Updated on Sat, Oct 7 2023 7:26 AM

- - Sakshi

బ్యాడ్మింటన్‌ ఆడుతున్న మంత్రి హరీశ్‌ రావు

సంగారెడ్డి: ‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబసభ్యులు.. ఎక్కడ ఉన్నా మీ గురించే ఆలోచన చేస్తుంటా.. ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది.. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపన.. ఎల్లప్పుడూ మీ ప్రేమ, ఆశీర్వాదం ఉండాలనే కోరుతుంటా..’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

శుక్రవారం రాత్రి స్థానిక కొండ భూదేవి గార్డెన్‌లో 400 మంది బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం రూ.లక్ష చెక్కులను, 400 మందికి గృహ లక్ష్మి ప్రొసీడింగ్‌ పత్రాలను, చిన్నకోడూరు మండల జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు, కుల సంఘాలకు భవన నిర్మాణ నిధుల మంజూరు ప్రొసీడింగ్‌ లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడిచ్చిన శక్తిని మీ సేవ కోసం నిరంతరం ధారపోస్తానని అన్నారు. రోజూ18 గంటల పాటు శ్రమిస్తున్నానని, సిద్దిపేట ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడుతునట్లు తెలిపారు.

ఒకప్పటి సిద్దిపేటకు ఇప్పుడు చూస్తున్న పట్టణానికి చాలా తేడా ఉందని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తానని చెప్పారు. సిద్దిపేట రాష్టానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. మీరు ఇచ్చిన బలంతో సిద్దిపేట గౌరవాన్ని ఇనుమడింపజేసేలా చేసినట్లు చెప్పారు. అంతకుముందు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ అత్యధికంగా బీసీ రుణాలు అందించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

క్రీడాహబ్‌ సిద్దిపేట
సిద్దిపేటను అన్ని క్రీడలకు నెలవుగా మార్చి క్రీడా హబ్‌గా చేసుకున్నట్టు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక స్టేడియంలో ఇండోర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.11కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడి సందడి చేశారు.

అనంతరం వాలీబాల్‌ అకాడమీ లో అడ్మిషన్లు పొందిన క్రీడాకారులకు పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మంజుల రాజనర్స్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజిత వేణుగోపాల్‌ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు సాయిరాం, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్‌ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement