కల్హేర్(నారాయణఖేడ్) : జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పనులు ప్రారంభించనున్నారు. సీఏం కేసీఆర్ పనులను ప్రారంభించాల్సి ఉండగా అప్పట్లో భారీ వర్షాలతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. నల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని గత అసెంబ్లీ సమావేశల్లో స్థానిక ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో అధికారులు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ప్రభుత్వం రూ.24.14 కోట్లు కేటాయించింది. దీంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే సీజన్‌నాటికి మహర్దశ..
నల్లవాగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ పనులు చేపడితే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మహర్ధశ పట్టనుంది. దెబ్బ తిన్న కాల్వల రూపురేఖలు మారనున్నాయి. కాల్వల మధ్యలో తూ ములు, షట్టర్లు, సైఫాన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్ధారిత ఆయకట్టు 6,030 ఎకరాలకు పూర్తిగా సాగు నీరందిం చేందుకు ప్రభుత్వం రూ.24.14 కోట్లు కేటాయించడంతో ఆధునికీకరణ పనులు పూర్తై ఆయ కట్టు రైతుల కష్టాలు తీరనున్నాయి.
వెంటనే పనులు ప్రారంభం..
నల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టేం దుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేశాం. వచ్చే ఖరీఫ్‌లో జూన్ మాసం చివరి వరకు పనులు పూర్తిచేస్తాం. కాల్వల ఆధునికీకరణ, తూములు, షట్టర్లు, గైడ్‌వాల్స్, ఇతర ప్రధాన పనులు చేపడతాం. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించే దిశగా పనులు చేస్తాం. కుడి, ఎడమ కాల్వల పరిధిలోని 2,500 ఎకరాలకు అదనంగా సాగు నీరందుతుంది. – రాములుగౌడ్, ఈఈ నీటి పారుదల శాఖ
Comments
Please login to add a commentAdd a comment