సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్ అయ్యారు. హరీష్ రావు.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడకు అంటూ చురకలు అంటించారు. ధనిక రాష్ట్రాన్ని(తెలంగాణ) మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు.. ఏపీకి రా ఏం జరుగుతుందో చూపిస్తాను. హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్తున్నాయి. హరీష్.. మీ రాష్ట్రంలో స్కూళ్లు, మా రాష్ట్రంలో స్కూళ్ల తేడా చూసుకో. తెలంగాణలో సంక్షేమ పథకాలు.. మా సంక్షేమ పథకాలకు తేడా చూడు. జీడీపీలో మేం దేశంలోనే నంబర్ వన్‌లో ఉన్నాం. హరీష్ రావు.. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అంటూ విమర్శలు చేశారు. అలాగే, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలి అని హితవు పలికారు.
ఇక, అంతకుముందు హరీష్ రావు.. ఏపీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. దీంతో, హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment