
సాక్షి, హైదరాబాద్: మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి వంటివారువచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేస్తారని, మంత్రి కేటీఆర్‌కు పోటీగా ఉన్నవారిని తప్పించడానికే ఈ ప్రయత్న మని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు పోటీ, వ్యతిరేకమని అనుకునేవాళ్లంతా టీఆర్‌ఎస్‌లో ఇబ్బందులు పడతారన్నారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాత్రమే సంతృప్తిగా ఉన్నారన్నారు.
గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఎర్రబెల్లికి జనగామ టికెట్ ఇస్తారని, తీగల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వరని విశ్లేషించారు. కేసీఆర్ నిజమైన తెలంగాణవాది అయితే, అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనను అడ్డుకోవాలన్నారు. సచివాలయానికి రాని కేసీఆర్‌ను స్టార్ సీఎం అని పొగిడిన పవన్‌ది మేకప్, పాకప్ మధ్యలో జరిగే షూటింగ్ వంటిదే తెలంగాణ టూర్ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment