ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. చెరువులు, కాలువలు నిండుకుండల్లా తయారయ్యాయి. అనేక ప్రాంతాల్లో చెరువులు తెగి గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. భారీ పంట నష్టం జరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఏపీలో రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. రోడ్డు, రైలు మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. వర్షబీభత్సానికి హైవేలపై భారీగా వరద నీరు చేరింది.
Published Fri, Sep 23 2016 7:06 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement