హెలీకాఫ్టర్ కూలి ఏడుగురి మృతి | Seven killed in New Zealand helicopter crash | Sakshi
Sakshi News home page

హెలీకాఫ్టర్ కూలి ఏడుగురి మృతి

Published Sat, Nov 21 2015 10:54 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

హెలీకాఫ్టర్ కూలి ఏడుగురి మృతి

హెలీకాఫ్టర్ కూలి ఏడుగురి మృతి

వెల్లింగ్టన్: హెలీకాఫ్టర్ కూలిన ఘటనలో 7 మందికి పైగా వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన న్యూజీలాండ్ ఫాక్స్ లోయలో శనివారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... హెలీకాఫ్టర్ కూలిన ఘటనలో పైలట్, ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారని తెలిపారు.

లోయ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో రక్షణ బృందాలు అక్కడికి చేరుకోవడానికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. ఫాక్స్- ఫ్రాంజ్ హెలీకాఫ్టర్ వైజ్ఞానిక పనులకు సంబంధించినదని ఓ ఆపరేటర్ ఆల్ఫైన్ వెల్లడించాడు. మృతదేహాలను వెలికితీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హెలీకాఫ్టర్ క్రాష్ అవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement