దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దట్టమైన పొగమంచు వ్యాపించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 18 విమానాలు, 50 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బుధవారం ఉదయం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వేస్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మంగళవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.