ఢిల్లీ-హైదరాబాద్ విమానం రద్దు
న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంలో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దట్టంగా అలముకున్న పొగ మంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. పొగ మంచుతో వెలుతురు మందగించడంతో 54 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 11 రైలు సర్వీసులను రద్దు చేశారు.
నాలుగు అంతర్జాతీయ విమానాలు, ఐదు దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ-హైదరాబాద్ విమాన సర్వీసు రద్దు చేశారు. మరోవైపు కనిష్ట ఉష్ణోగత్రలు రోజురోజుకు తగ్గుతుండడంతో హస్తినవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు, చలిగాలులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.