చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో ఆదివారం ఉదయం తీవ్రమైన స్థాయిలో పొగమంచు చుట్టు ముట్టింది. దీంతో చెన్నై వెళ్లాల్సిన పలు విమానాలని తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచుతో చెన్నై ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలిపారు.
This looks like some crazy fog+smoke (Bhogi Effect). Visibility is very poor across Chennai..👀
— Chennai Updates (@UpdatesChennai) January 14, 2024
pic.twitter.com/bRka4t21b3
ఈ క్రమంలో ప్రతికులమైన వాతావరణం కారణంగా చెన్నై, ఢిల్లీకి సంబంధించిన పలు విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని ఇండిగో ఎయిర్ లైన్స్ ‘ఎక్స్’ ట్విటర్‌లో పేర్కొంది. విమాన ప్రయాణికులు ఎప్పటికప్పుడు ముందుగానే విమాన వివరాలు తెలుకోవాలని సూచించింది.
#WATCH | Tamil Nadu: A layer of smog engulfs several parts of Chennai.
— ANI (@ANI) January 14, 2024
(Drone visuals from Rajiv Gandhi Road, shot at 6:40 am) pic.twitter.com/BEdSPwhsrH
అయితే ఈ రోజు(ఆదివారం) చెన్నైలో పెద్ద ఎత్తున పొగమంచు ఏర్పడటానికి భోగి పండగ సందర్భంగా ప్రజలు వేసే మంటటు కారణమని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే.
VIDEO | Flight services affected at Chennai Airport due to dense fog in the region. pic.twitter.com/TvQBjxn66l
— Press Trust of India (@PTI_News) January 14, 2024
Comments
Please login to add a commentAdd a comment