Chennai Air Port
-
Chennai: భారీ వర్షం, బలమైన గాలులు.. విమానం ల్యాండింగ్ వేళ తప్పిన ప్రమాదం!
చెన్నై: ఫెంగల్ తుపాను కారణంగా తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో భారీ వర్షాల కురుస్తున్నాయి. భారీ వర్షం, బలమైన గాలులతో తమిళనాడులో భయానక వాతావరణం నెలకొంది. చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.ఇక, తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టును శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మూసివేశారు. అయితే శనివారం చెన్నైలో విమానం మూసివేతకు ముందు ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలించని సమయంలో ముంబై-చెన్నై 6E 683 సర్వీస్ విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నం చేయగా తృటిలో ప్రమాదం తప్పింది.అయితే, ఇండిగో ఎయిర్ లైన్స్ చెందిన విమానం శనివారం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో బలమైన గాలులు విస్తుండటంతో రన్‌వేపై విమానం అదుపు తప్పింది. రన్‌వేను నెమ్మదిగా ఢీకొట్టి బ్యాలెన్స్ తప్పింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని టేకాఫ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్టు సమాచారం. ఇక, దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Indigo on the Viral video from Chennai Airport: Due to adverse weather conditions, including rain and strong, gusty winds, the cockpit crew of flight 6E 683, operating between Mumbai and Chennai, executed a go-around on November 30, 2024. In accordance with established safety… pic.twitter.com/hqzfR8N3UF— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) December 1, 2024 -
విరాట్ కోహ్లీ, రాధిక శరత్‌కుమార్ సెల్ఫీ.. ఎక్కడో తెలుసా..?
సౌత్ ఇండియా స్టార్ యాక్టర్ రాధిక శరత్‌కుమార్ ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉండటంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సౌత్ సినిమా ఇండస్ట్రీతో విరాట్‌కు పెద్దగా పరిచయం లేదు. అలాంటిది వీరిద్దరూ ఎక్కడ పోటో దిగి ఉంటారబ్బా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. రాధిక షేర్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇదీ చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్సెల్ఫీ ఫోటోను షేర్ చేసిన రాధికా ఇలా చెప్పుకొచ్చారు. ' కొన్ని కోట్ల హృదయాలకు దగ్గరైన వ్యక్తి విరాట్ కోహ్లీ. తన ఆటతో మనల్ని గర్వపడేలా చేస్తాడు. కొంత సమయం పాటు అతనితో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది. సెల్ఫీ తీసుకున్నందుకు ధన్యవాదాలు.' అంటూ ఆమె తెలిపారు. సోషల్‌మీడియాలో ఈ ఫోటో భారీగా వైరల్ అవుతుంది.చెన్నై వేదికగా సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఇవాళ వేకువజామున 4 గంటలకు లండన్ నుంచి నేరుగా ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఈ క్రమంలో అదే విమానంలో రాధిక శరత్‌కుమార్ కూడా ప్రయాణం చేశారు. ఆ సమయంలో వారిద్దరూ సరదాగా కొంత సమయం పాటు ముచ్చటించి ఆపై సెల్ఫీ తీసుకున్నారు. View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
పొగ మంచు ఎఫెక్ట్: చెన్నై వెళ్లాల్సిన విమానాలు శంషాబాద్‌కు మళ్లింపు
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో ఆదివారం ఉదయం తీవ్రమైన స్థాయిలో పొగమంచు చుట్టు ముట్టింది. దీంతో చెన్నై వెళ్లాల్సిన పలు విమానాలని తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచుతో చెన్నై ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలిపారు. This looks like some crazy fog+smoke (Bhogi Effect). Visibility is very poor across Chennai..👀 pic.twitter.com/bRka4t21b3 — Chennai Updates (@UpdatesChennai) January 14, 2024 ఈ క్రమంలో ప్రతికులమైన వాతావరణం కారణంగా చెన్నై, ఢిల్లీకి సంబంధించిన పలు విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని ఇండిగో ఎయిర్ లైన్స్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. విమాన ప్రయాణికులు ఎప్పటికప్పుడు ముందుగానే విమాన వివరాలు తెలుకోవాలని సూచించింది. #WATCH | Tamil Nadu: A layer of smog engulfs several parts of Chennai. (Drone visuals from Rajiv Gandhi Road, shot at 6:40 am) pic.twitter.com/BEdSPwhsrH — ANI (@ANI) January 14, 2024 అయితే ఈ రోజు(ఆదివారం) చెన్నైలో పెద్ద ఎత్తున పొగమంచు ఏర్పడటానికి భోగి పండగ సందర్భంగా ప్రజలు వేసే మంటటు కారణమని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. VIDEO | Flight services affected at Chennai Airport due to dense fog in the region. pic.twitter.com/TvQBjxn66l — Press Trust of India (@PTI_News) January 14, 2024 -
ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులలో అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో మొత్తం రూ.14 కోట్ల విలువగల బంగారాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో 8.49 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ 4.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో కూడా భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ. 9.11 కోట్ల విలువ చేసే 16.86 కేజీల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సింగపూర్, మలేషియా, దుబాయ్, అబుదాబీ ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఐపీఎల్ 16వ సీజన్లో ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్ నెగ్గింది. అయితే ధోని ఐపీఎల్ 16వ సీజన్ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే తలా నీ-క్యాప్(Knee Cap)పెట్టుకొని ఆడాడు. నాకౌట్ దశకు చేరుకునే సరికి ధోని పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అందుకే బ్యాటింగ్ సమయంలో క్రీజులోకి వస్తే ఎక్కువగా బౌండరీలు, సిక్సర్ల మీదనే దృష్టి సారించేవాడు. ఇప్పటికైతే మోకాలి గాయం తగ్గినప్పటికి సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనబెడితే ఇటీవలే చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ధోని ప్రొడక్షన్ హౌస్ నుంచి LGM(ఎల్జీఎం) అనే తమిళ సినిమా తెరకెక్కుతుంది. కాగా ధోని సోమవారం తన భార్య సాక్షితో కలిసి సినిమా లాంచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చాడు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అందులో ఒక అభిమాని.. మహీ భయ్యా నీ మోకాలి నొప్పి ఎలా ఉంది.. తర్వాతి ఐపీఎల్ ఆడతావా అంటూ ప్రశ్నించాడు. కానీ ధోనికి ప్రశ్న సరిగ్గా వినిపించలేదు. అభిమానులు ఏది అడిగినా అది మన మంచి కోసమే అయి ఉంటుందని ధోనికి తెలుసు.. అందుకే బాగానే ఉన్నా అన్నట్లు చేతులు ఊపుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జూలై 7న ధోని 42వ పుట్టినరోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు పురస్కరించుకొని ధోనికి అభిమానులు సహా వివిధ దేశాల క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని స్థితి. తొమ్మిది నెలల తర్వాత తాను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఐపీఎల్ 2024 ఆడుతానని ధోని ఇదివరకే తెలిపాడు. చదవండి: David Warner: హుందాగా తప్పుకుంటాడా లేక తప్పించే దాకా తెచ్చుకుంటాడా..? -
సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం
సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటారు. ఇటీవల తన కాలుకి గాయమైందని.. అయినా తన ప్రయాణం ఆగదంటూ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అన్నట్టుగానే మంగళవారం ఉదయం కుష్బూ వేరే రాష్ట్రానికి వెళ్లడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థపై ఆమె ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న కుష్బూ గాయమైన కాలితోనే మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. చదవండి: వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దే ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్ తల్లి అయితే అక్కడ ఆమెకు వీల్‌చైర్ అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. అందులో ఎయిర్ ఇండియా సంస్థకు వీల్‌చైర్ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ప్రశ్నించారు. అందు కోసం తాను అరగంట పాటు కాలి నొప్పితో ఎదురుచూశానన్నారు. ఆ తర్వాత వేరే విమాన సంస్థ నుంచి వీల్‌చైర్ తీసుకొచ్చి తనను పంపించారన్నారు. కాగా ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా విమాన సంస్థ నిర్వాహకులు నటి కుష్బూకు క్షమాపణ తెలుపుతూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామం, ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తా’’మని పేర్కొన్నారు. Dear @airindiain you do not have basic wheelchair to take a passenger with a knee injury. I had to wait for 30mnts at chennai airport with braces for my ligament tear before they could get a wheelchair borrowed from another airline to take me in. I am sure you can do better. — KhushbuSundar (@khushsundar) January 31, 2023 -
చెన్నై చేరుకున్న రజనీకాంత్.. అభిమానుల ఘన స్వాగతం
సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం జూన్ 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మయో క్లినికల్ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారికి అభివందంనం చేసిన తలైవా అనంతరం తన కారులో ఇంటికి చేరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తైంది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కీర్తిసురేష్‌లతో పాటు మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. Thalaivar Returns🔥😍😍😍💖💖💖#Annaatthe #AnnaattheDeepavali #AnnaattheFLSoon #AnnaattheFirstLook #Thalaivar #SuperstarRajinikanth #Rajinikanth pic.twitter.com/PfGZKG4oOr — Vijay Andrews (@vijayandrewsj) July 8, 2021 -
చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్ స్వాధీనం
తిరువొత్తియూరు (చెన్నై): దక్షిణాఫ్రికా నుంచి చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చిన రూ.70 కోట్ల విలువైన 9.8 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దోహా నుంచి వస్తున్న ప్రత్యేక విమానంలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంతో కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి నేతృత్వంలో అధికారులు నిఘా ఉంచారు. ప్రయాణికుల్లో ఓ మహిళ వీల్‌చైర్‌లో, ఆమెకు తోడుగా మరొక మహిళ వచ్చారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు వారు తెలిపారు. సూట్‌కేస్‌లను తనిఖీ చేయగా నాలుగు పార్శిళ్లలో 9.8 కిలోల హెరాయిన్ బయటపడింది. -
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
చెన్నై: ముంబై-చెన్నై ఎయిర్ ఇండియా విమానానికి చెన్నై ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. కిందికి దిగుతున్న సమయంలో విమానాశ్రయంలో పార్క్ చేసివున్న కేటరింగ్ వాహనానికి విమానం రెక్క తగిలింది. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతింది. పెద్ద ప్రమాదం జరగలేదు. విమానంలో ఉన్న 168 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు. కేటరింగ్ వాహనాన్ని సరిగ్గా పార్క్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. సెక్యురిటీ, సేఫ్టీ అధికారులు విమానాన్ని పరిశీలించారు. తిరుగు ప్రయాణానికి విమానం అనువుగానే ఉందని నిర్ధారించారు.