ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు | Air India flight brushes against catering vehicle | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు

Published Sun, Mar 16 2014 12:06 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

ఫైల్ ఫోటో - Sakshi

ఫైల్ ఫోటో

చెన్నై: ముంబై-చెన్నై ఎయిర్ ఇండియా విమానానికి చెన్నై ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. కిందికి దిగుతున్న సమయంలో విమానాశ్రయంలో పార్క్ చేసివున్న కేటరింగ్ వాహనానికి విమానం రెక్క తగిలింది. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతింది.
పెద్ద ప్రమాదం జరగలేదు. విమానంలో ఉన్న 168 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు. కేటరింగ్ వాహనాన్ని సరిగ్గా పార్క్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. సెక్యురిటీ, సేఫ్టీ అధికారులు విమానాన్ని పరిశీలించారు. తిరుగు ప్రయాణానికి విమానం అనువుగానే ఉందని నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement