Chennai: భారీ వర్షం, బలమైన గాలులు.. విమానం ల్యాండింగ్‌ వేళ తప్పిన ప్రమాదం! | IndiGo Flight 6E 683 Struggling To Land In Chennai Over Cyclone Fengal | Sakshi
Sakshi News home page

Chennai: భారీ వర్షం, బలమైన గాలులు.. విమానం ల్యాండింగ్‌ వేళ తప్పిన ప్రమాదం!

Published Sun, Dec 1 2024 4:18 PM | Last Updated on Sun, Dec 1 2024 4:28 PM

IndiGo Flight 6E 683 Struggling To Land In Chennai Over Cyclone Fengal

చెన్నై: ఫెంగల్‌ తుపాను కారణంగా తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో భారీ వర్షాల కురుస్తున్నాయి. భారీ వర్షం, బలమైన గాలులతో తమిళనాడులో భయానక వాతావరణం నెలకొంది. చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ఇక, తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టును శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మూసివేశారు. అయితే శనివారం చెన్నైలో విమానం మూసివేతకు ముందు ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలించని సమయంలో ముంబై-చెన్నై 6E 683 సర్వీస్‌ విమానాన్ని ల్యాండ్‌ చేసే ప్రయత్నం చేయగా తృటిలో ప్రమాదం తప్పింది.

అయితే, ఇండిగో ఎయిర్ లైన్స్ చెందిన విమానం శనివారం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ సమయంలో బలమైన గాలులు విస్తుండటంతో రన్‌వేపై విమానం అదుపు తప్పింది. రన్‌వేను నెమ్మదిగా ఢీకొట్టి బ్యాలెన్స్‌ తప్పింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని టేకాఫ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయినట్టు సమాచారం. ఇక, దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement