చెన్నై: ఫెంగల్ తుపానుతో తమిళనాడు అతలాకుతలం అవుతున్న వేళ.. చెన్నైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడానికి వెళ్లిన ఓ యువకుడు.. శవమై వరద నీటిలో తేలుతూ కనిపించాడు.
తుపాను కారణంగా చెన్నై సహా తమిళనాడు అంతటా కుండపోత కురుస్తోంది. ఈ క్రమంలో ఓ ఏటీఎంలో వరద నీరు చేరింది. అయితే అది గమనించకుండా లోపలికి వెళ్లిన ఓ వ్యక్తి.. కరెంట్ షాక్ కొట్టి మృతిచెందాడు. ఆపై యువకుడి మృతదేహం వర్షపు నీటిలో తేలియాడుతుండగా గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment