heavy rain effect
-
వేగంగా కదులుతున్న వాయుగుండం ఏపీలో ఆ మూడు జిల్లాలకు ఎఫెక్ట్
-
రాబోయే 5 రోజులూ ఏపీలో హై అలెర్ట్
-
Hyderabad Rain Photos: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
-
విశాఖలో భారీ వర్షం (ఫొటోలు)
-
కుప్పకూలిన భారీ చెట్టు.. మా.. ముజే.. బచావో అంటూ ఓ ఆటో డ్రైవర్..
హైదరాబాద్: మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వచ్చి కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో రెడ్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగి ఉన్నాయి. ఇంతలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం 3 ఆటోలపై కుప్పకూలింది. ఇందులో ఉన్న ఓ ఆటో డ్రైవర్.. తనను కాపాడంటూ వేడుకుంటూనే అసువులు బాసిన విషాద ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్ (36) నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ తెలుగు అకాడమీ మీదుగా బషీర్‌బాగ్ వెళ్తున్నాడు. సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో సరిగ్గా చెట్టు కింద ఆగాడు. మరో 18 సెకన్లలో గ్రీన్ లైట్ పడేలోపే మృత్యువు చెట్టు రూపంలో అతడిని కబళించింది. నాలుగు సెకన్ల వ్యవధిలో చెట్టు కుప్పకూలి దాని కొమ్మ ఆటోపై పడింది. ఆటోలోనే గౌస్ ఒరిగిపోయాడు. కనీసం కదలడానికి కూడా వీలు లేకుండా ఉండటంతో ‘మా.. ముజే బచావో’ అంటూ ప్రాణాలు విడిచాడు. అతడి మూ లుగు విన్న తోటి వాహనదారులు రక్షించేందుకు ప్రయత్నించడానికి సైతం వీల్లేకుండా పోయింది. చేయీ.. చేయీ.. కొమ్మను జరిపి.. మృతుడు గౌస్ ఉన్న ఆటో ముందూ వెనకా ఆటోలు ఉన్నాయి. మరో రెండు ఆటోలపై చెట్టు కొమ్మలు పడుతున్న సమయంలో ఆ ఇద్దరు డ్రైవర్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెనక ఉన్న ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ముందున్న మరో ఆటో పాక్షికంగా దెబ్బతిన్నది. స్థానికులు, వాహనదారులు కలిసి చెట్టుకొమ్మను ఆటోల మీదనుంచి పక్కకు జరపడంతో గౌస్ మృతదేహాన్ని బయటకి తీసి 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చెట్టు కూలడంతో నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు తెలుగు అకాడమీ రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో హిమాయత్‌నగర్ లిబర్టీ, బషీర్‌బాగ్, నారాయణగూడ, కింగ్‌కోఠి, నల్లకుంట, చే నంబర్ వరకు వేలాది వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హిమాయత్‌నగర్ ప్రాంతంలో సుమారు 19 భారీ వృక్షాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని జనవరిలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్ ఆరోపించారు. వారు పట్టించుకున్నట్లైతే శనివారం నాటి ప్రమాదం జరిగేది ఉండేది కాదన్నారు. -
ఏపీ వైపు వస్తున్న ఉపరితల ఆవర్తనం
-
వరదల ఎఫెక్ట్: ముంపులో లంక గ్రామాలు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధారల నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో, లంక గ్రామాలు మరోసారి ముంపునకు గురవుతున్నాయి. ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో పది గేట్లు 15 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం నుంచి మొత్తం 4.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోని నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు 3.50 లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు.. పులిచింతల గేట్లు 20 ఎత్తివేత వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి లక్ష క్యూసెక్కులను సముద్రంలోకి చేరుతోంది. కాగా, రాత్రికి వరద ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో, సాగర్ దిగువన నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగింది. పోలవరంలోకి 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. 15 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక, ధవళేశ్వరం నుంచి 13.76 లక్షల క్యూసెక్కులు సముద్రంలకి వచ్చి చేరుతోంది. గొట్టా బ్యారేజ్ నుంచి 25 వేల క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు -
Hyderabad: జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు
సాక్షి, సిటీబ్యూరో: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన్ని తలపిస్తోంది బల్దియా దయనీయ పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు పడింది. ఆయా ప్రాంతాల్లో సాఫీ ప్రయాణంతో పాటు పర్యాటక ప్రాంతాలుగానూ తీర్చిదిద్దేందుకు మూసీ, ఈసీలపై 15 ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. గత జనవరిలోనే అందుకు అవసరమైన రూ.545 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆ పనుల్ని ఎవరు చేపట్టాలో పేర్కొనలేదు. వర్షాల నేపథ్యంలో ఇటీవల మొత్తం 15 పనుల్లో రూ.168 కోట్లు అవసరమయ్యే 4 పనుల బాధ్యతలు జీహెచ్ఎంసీకి అప్పగించింది. ఒక పనిని కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి (కుడా)కు అప్పగించింది. మిగతా పనులను హెచ్ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌లకు ఇచ్చింది. పనులు చేపట్టేందుకు, అవసరమైన నిధులు సమకూర్చునేందుకు సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంది. సొంత వనరుల ద్వారా గాని.. రుణాల ద్వారా నిధులు సమకూర్చుకొని గాని పనులు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ, ఎస్‌ఎన్‌డీపీల కింద చేపట్టిన పనులకు చేసిన అప్పులతో అల్లాడుతున్న జీహెచ్ఎంసీ నెలనెలా సిబ్బంది జీతాలే సకాలంలో చెల్లించలేకపోతోంది. ప్రభుత్వ ఈ ఆదేశంతో మరింత అదనపు భారం కానుంది. మూసీపై ఏ ప్రభుత్వ విభాగం ఎన్ని బ్రిడ్జిలు నిర్మించాలో.. అందుకయ్యే వ్యయం వివరాలిలా.. జీహెచ్ఎంసీ: రూ.168 కోట్లు ♦మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వేను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి :రూ. 39 కోట్లు ♦మూసారాంబాగ్‌ను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి: రూ.52కోట్లు ♦చాదర్‌ఘాట్ వద్ద హైలెవెల్ బ్రిడ్జి: రూ.42 కోట్లు ♦అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు. హెచ్ఆర్డీసీఎల్ : రూ.116 కోట్లు ♦కారిడార్ నంబర్ 99 మిస్సింగ్ లింక్ వద్ద హైలెవల్ బ్రిడ్జి:రూ. 52 కోట్లు. ♦ఈసాపై సన్‌సిటీ– చింతల్మెట్ కలుపుతూహైలెవల్ బ్రిడ్జి (పవర్ కారిడార్):రూ.32 కోట్లు. ♦బండ్లగూడ జాగీర్‌లో ఈసాపై ఇన్నర్‌రింగ్ రోడ్లు– కిస్మత్‌పూర్‌లను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి:రూ.32కోట్లు. కుడా: రూ.40 కోట్లు 1. అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పాదచారుల వంతెన: రూ.40కోట్లు. హెచ్ఎండీఏ: రూ.221 కోట్లు ♦ఉప్పల్ లేఅవుట్– మూసీ దక్షిణ ఒడ్డును కలుపుతూ కొత్త బ్రిడ్జి: రూ.42 కోట్లు. ♦మంచిరేవుల– నార్సింగిని కలుపుతూ హైవవెల్ బ్రిడ్జి: రూ.39 కోట్లు. ♦బుద్వేల్ వద్ద ( ఈసాకు సమాంతరంగా ఐటీపార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ హైలెవల్ బ్రిడ్జి:రూ.32 కోట్లు. ♦హైదర్షాకోట్ – రామ్‌దేవ్‌గూడల మధ్య కొత్త వంతెన : రూ.42కోట్లు. ♦బుద్వేల్ వద్ద రెండో కొత్త బ్రిడ్జి (ఈసాకు సమాంతరంగా ఐటీ పార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ): రూ.20 కోట్లు. ♦ప్రతాపసింగారం– గౌరెల్లి హైలెవల్ బ్రిడ్జి: రూ.35 కోట్లు. ♦మంచిరేవుల వంతెనకు కలుపుతూ కొత్త లింక్‌రోడ్డు: రూ.11 కోట్లు. మొత్తం వ్యయంలో సగం నిధులు హెచ్ఎండీఏ భరించాల్సిందిగా, మిగతా సగం నిధులు బ్యాంకు రుణం ద్వారా జీహెచ్ఎంసీ సమకూర్చాల్సిందిగా పరిపాలన అనుమతుల జారీ సమయంలోనే ప్రభుత్వం తెలిపింది. ఎవరు ఏ బ్రిడ్జీలు నిర్మించాలనేది తాజాగా స్పష్టం చేసింది. చదవండి: 16న ఏకకాలంలో ‘జనగణమన’ -
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!
ముంబై : భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ముంబై, థానే, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలెర్టు జారీ చేసింది. ముంబైలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. తాజాగా ముంబై పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పాల్గఢ్, ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (ముంబైకి భారీ వర్ష సూచన) అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్, విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కాగా శుక్రవారం కురిసిన వర్షాలకే ముంబై మహా నగరం అతలాకుతలం అయింది. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కుండపోత వాన పడటంతో 161.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేగాక కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. (పిడుగుల బీభత్సం.. 31 మంది మృతి) -
పాన్పుపై సేదతీరిన పులి!
అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కు ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామమది. పేరు హర్మోతి. మోతీలాల్ ఎప్పటిలాగే గురువారం ఉదయాన్నే తన పాత సామాను దుకాణంలో కూర్చున్నాడు. అంతలో బయట నుంచి ‘పులి పులి’ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఎంటో చూద్దామని దుకాణం బయటకొచ్చిన మోతీలాల్‌కు గుండె ఆగినంత పనైంది. ఆయనకు ఎదురుగా కేవలం 20 అడుగుల దూరంలో బెంగాల్ టైగర్ ఉంది. అది మోతీలాల్ వైపే వస్తోంది. గాండ్రిస్తూ పెద్ద పులి తనవైపే వస్తుండటంతో మోతీలాల్ శరీరం భయంతో మొద్దుబారి అక్కడే అలాగే నిల్చుండిపోయాడు. అయితే, బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్న ఆ పులి అతని కళ్లల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా.. అతని పక్కనుంచి దుకాణంలోపలికి వెళ్లింది. విశ్రాంతి తీసుకునేందుకు దుకాణంలోపల ఉన్న మంచంపై సెటిలైంది. పులి లోపలికి వెళ్లిపోగానే బతికితే చాలురా బాబు అనుకుంటూ అక్కడి నుంచి పరుగెత్తాడు మోతీలాల్. గ్రామంలోని పశువైద్యుడు శాంశుల్ అలీ అటవీ శాఖ అధికారులకు వెంటనే ఈ విషయం చేరవేశాడు. దీంతో అధికారుల బృందం హుటాహుటిన అక్కడికొచ్చింది. భారీ వర్షాల కారణంగా కజిరంగా జాతీయ పార్కు భూభాగం 95శాతం నీట మునిగిందని, దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర వన్యప్రాణుల్లాగే పులి కూడా జనావాసాల్లోకి వచ్చిందని అధికారుల అంచనా. పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి మళ్లీ పార్కులోకి తీసుకెళ్లి వదిలేయాలా? లేక తన దారిని అది పోయేదాకా వేచిఉందామా అని అధికారులు ఆలోచిస్తున్నారు. -
ముంపు భయం..!
సాక్షి, కొత్తగూడెం (ఖమ్మం): గత నెలలో వరదలు వచ్చినప్పుడు పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి. గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక దాటితే ఇక భారీ నష్టమే. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మిస్తే భవిష్యత్తులో ముంపు భయం మరింతగా పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, ముంపు వాసులను అప్రమత్తం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం వద్ద ఈ నీటిమట్టం నిరంతరం కొనసాగుతుంది. ఇక ప్రతి ఏటా వచ్చే వర్షాలకు ప్రవాహం పెరిగితే అత్యంత వేగంగా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో 53 అడుగుల మేర నీటిమట్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయకముందే పంటలు, 53 అడుగులకు చేరగానే పరీవాహక ప్రాంతాల్లోని రోడ్లు మునిగిపోతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చితే నష్టం అపారంగా ఉంటుంది. ఈ క్రమంలో రైతులకు ఇప్పటినుంచే ‘పోలవరం’ భయం పట్టుకుంది. ఆనకట్ట నిర్మిస్తే ప్రతి ఏటా నష్టం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవితవ్యంపై ఆందోళన.. ఎగువ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలతో పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో మొత్తం 1,258 హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. ఇక గోదావరి ఎగపోటు కారణంగా చర్ల మండలంలోని తాలిపేరు, బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని నదులు సైతం పొంగిపొర్లుతాయి. దీంతో రైతులకు నష్టం మరింతగా పెరుగుతుంది. పోలవరం నిర్మాణం పూర్తయితే గోదావరి ఉధృతి పెరిగి భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, మంగపేట మండలాలకు సైతం ముంపు బెడద వాటిల్లే ప్రమాదం ఉంది. అప్పుడు తమ భవితవ్యమేంటని ఆయా మండలాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న గోదావరి వరదల స్థితిగతులు తెలిసిన ఈ మండలాల ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమ భూములు నీటమునుగుతాయని గగ్గోలు పెడుతున్నారు. పరిహారం ప్రశ్నార్థకమే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర విభజన సమయంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని సీతారామనగరం, శ్రీధర వెలేరు, గణపవరం, ఇబ్రహీంపేట రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని చింతూరు, వేలేరుపాడు, నెల్లిపాక, వీఆర్‌పురం మండలాలను కూడా ఏపీలో కలిపారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య విలీన మండలాల అంశం కొనసాగుతూనే ఉంది. ఈ మండలాలను తిరిగి తమ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. విలీన ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు ముంపునకు సంబంధించి నష్టపరిహారం అందించారు. అయితే భవిష్యత్తులో తెలంగాణలోని భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో మునిగిపోయే పంటలకు పరిహారం చెల్లింపులో తీరని అన్యాయం జరుగుతుందని, దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తున్నారు. బూర్గంపాడు మండలం నుంచి ఆంధ్రాలో కలిపిన గ్రామాల్లో వరద ముంపునకు గురయ్యే భూములలోకి వరదనీరు చేరేటప్పటికీ గోదావరి, కిన్నెరసాని నదులకు ఇవతల ఉన్న తెలంగాణలోని బూర్గంపాడు మండలంలో వేలాది ఎకరాలు ముగునుతాయి. అయితే ఈ గ్రామాలకు పోలవరం ముంపు ప్యాకేజీ వర్తించడం లేదు. గోదావరి వరద వచ్చినప్పుడు మొదటగా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, సారపాక, మోతె , ఇరవెండి గ్రామాలలోని వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ భూములకు పరిహారం చెల్లించే విషయంపై స్పష్టత లేదు. భూములు ముంపునకు గురైతే తమ పరిస్థితి ఏమిటనేది స్థానికులకు ప్రశ్నార్థకంగా మారింది. కిన్నెరసానికి అవతల ఉన్న గ్రామాలు ఆం«ధ్రప్రదేశ్‌లో విలీనం కావటంతో అక్కడి ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందిస్తుంది. కాగా, కిన్నెరసాని, గోదావరి నదులకు ఇవతల ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ముంపు గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరదలను ప్రామాణికంగా తీసుకోవాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ముంపు భూములపై నీటిపారుదల శాఖ అధికారులు బూర్గంపాడు మండలంలో సర్వే చేశారు. ఈ మండలంలోని పలు గ్రామాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని నిర్ధారించి అక్కడ సర్వే రాళ్లు పాతారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటంతో బూర్గంపాడు మండలం రెండు ముక్కలైంది. మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అయితే గతంలో వచ్చిన గోదావరి వరదలను లెక్కలోకి తీసుకుంటే ఏపీలో విలీనమైన గ్రామాల కంటే ప్రస్తుతం భద్రాచలం డివిజన్లోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, మోతె, ఇరవెండి, భద్రాచలం పరిసర గ్రామాలే ఎక్కువ ముంపునకు గురవుతాయి. గతంలో గోదావరి వరదల ముంపు రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకుని పోలవరం ముంపును గుర్తించాలని మండల వాసులు కోరుతున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే మండలాల్లోని వ్యవసాయ భూములకు తగిన పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలని, లేకుంటే మండలానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. బాగా నష్టపోతాం సీతారామనగరం వైపు నాకున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు సర్వే చేశారు. అదే సమయంలో అంతకంటే ముందుగా మునిగే బూర్గంపాడు వైపు భూములకు ఎలాంటి సర్వే చేయలేదు. కిన్నెరసాని వరద కుడివైపు కంటే ఎడమవైపే ఎక్కువ నష్టం చేస్తుంది. అటు పరిహారం ఇచ్చి, ఇటు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి. – దారం వెంకటరెడ్డి, సంజీవరెడ్డిపాలెం భూములన్నీ మునుగుతాయి ప్రస్తుతం సీతారామనగరం వైపున ముంపునకు గురవుతాయని సర్వే చేస్తున్న భూముల ప్రకారం తీసుకుంటే బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలులో ఎక్కువ భూములు మునుగుతాయి. ప్రభుత్వాలు వేరైనా వరదముంపు మాత్రం భూముల లెవల్‌ను బట్టే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – మేకల నర్సింహారావు, బూర్గంపాడు -
వణికిన చెన్నై
సాక్షి,చెన్నై: భారీ వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై సహా పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కుండపోతతో చెన్నైలో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులూ జలమయమయ్యాయి. చెన్నై నగరంలోని జీఎస్టీ రోడ్, అన్నాసలై సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలకు తంజావూర్ జిల్లాలో ఓ వ్యక్తి మరణించారు. రానున్న 24 గంటల్లో చెన్నై నగరంతో పాటు పరిసర ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ర్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేసింది. -
తుంగ.. బెంగ
- కర్ణాటకలో తీవ్ర వర్షాభావం - తుంగభద్ర జలాశయంలోకి చేరని నీరు - డెడ్ స్టోరేజీకి పడిపోయిన నీటిమట్టం అనంతపురం సెంట్రల్ : జిల్లాకు ప్రధాన నీటి వనరు అయిన తుంగభద్ర జలాశయం వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమైనా కర్ణాటకలో ఆశించిన స్థాయిలో వానలు కురవలేదు. దీంతో జలాశయానికి నీరు చేరడం లేదు. ప్రస్తుతం నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ఈ నెలలో మంచి వర్షాలు రాకపోతే పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో అనంతకు తుంగభద్రజలాలు ఎప్పుడొస్తాయన్నది దైవాధీనంగా మారింది. కరువు జిల్లా ‘అనంత’లో కాస్తోకూస్తో పంటలు పండుతున్నాయంటే అది తుంగభద్ర జలాశయం పుణ్యమే. ఈ జలాశయంలోకి 140 టీఎంసీల నీరు వస్తే హెచ్చెల్సీ వాటాగా మనకు 32 టీఎంసీలు వదలాల్సి ఉంటుంది. అయితే.. వర్షాభావం, పూడిక తదితర కారణాలతో ప్రతియేటా సగటున 20 టీఎంసీలు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. ఈ నీటితో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేలాది ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. రెండేళ్లుగా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు రాకపోవడంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది పరిస్థితి మరీ ఘోరం. తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ) ద్వారా ఏటా లక్ష ఎకరాల వరకు సాగునీరు అందించేవారు. గత ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండటంతో 40 వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అది కూడా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) పరిధిలో మాత్రమే పంటలు వేశారు. వీటికి కూడా కీలక సమయంలో నీరివ్వలేకపోయారు. సమృద్ధిగా నీళ్లు రాకపోవడం, ప్రణాళిక లేకుండా కేటాయింపులు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. మిగతా కాలువల కింద ఎకరాకు కూడా నీరివ్వలేదు. డ్యాంలో డెడ్‌స్టోరేజీ తుంగభద్ర జలాశయం ఎన్నడూ లేని విధంగా ఈసారి డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 0.963 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. సాధారణంగా మే నెల నుంచే కర్ణాటకలో వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ రెండు, మూడేళ్లుగా మే, జూన్, జూలై మాసాల్లో జలాశయంలోకి పెద్దగా నీరు రావడం లేదు. ఆ తర్వాత వస్తుండటంతో దీని ప్రభావం ‘అనంత’ రైతులపై పడుతోంది. డ్యాం నుంచి సకాలంలో నీళ్లు విడుదల చేయకపోవడం, అదను తప్పించి పంటలు సాగు చేస్తుండడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటున్నారు. గడిచిన మూడేళ్లలో నెల వారీగా టీబీడ్యాంలోకి వచ్చిన నీరు (టీఎంసీలలో).. సంవత్సరం మే జూన్ జూలై ఆగష్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మొత్తం 2014–15 4.184 6.252 82.666 178.455 54.416 32.327 6.793 365.093 2015–16 0.000 21.957 42.749 31.549 14.689 10.207 1.8900 123.041 2016–17 0.000 3.282 43.432 32.487 7.310 0.000 1.044 87.555 గడిచిన ఐదేళ్లలో హెచ్చెల్సీకి వచ్చిన నీళ్లు సంవత్సరం వచ్చిన నీళ్లు (టీఎంసీలలో) 2012–13 19.247 2013–14 26.455 2014–15 22.520 2015–16 16.997 2016–17 10.327 జూలై నుంచే జలాశయంలోకి నీళ్లు తుంగభద్ర జలాశయంలోకి ఏటా జూలైలోనే ఇన్‌ఫ్లో వస్తోంది. గత కొన్నేళ్లుగా మే, జూన్‌లో ఆశించినస్థాయిలో నీరు చేరడం లేదు. గతేడాది కూడా జూలైలో 42 టీఎంసీలకు పైగా నీళ్లు వచ్చాయి. ప్రస్తుతం జలాశయంలోకి 182 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు చెబుతున్నా.. అది దేనికీ చాలదు. - టీవీ శేషగిరిరావు, ఎస్ఈ, హెచ్చెల్సీ