చెన్నై చేరుకున్న రజనీకాంత్‌.. అభిమానుల ఘన స్వాగతం | Super Star Rajinikanth Returns To Chennai From US After Health Check-up | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి తిరిగివచ్చిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

Published Fri, Jul 9 2021 2:28 PM | Last Updated on Fri, Jul 9 2021 2:41 PM

Super Star Rajinikanth Returns To Chennai From US After Health Check-up - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. వైద్య ప‌రీక్ష‌ల కోసం జూన్ 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారికి అభివందంనం చేసిన త‌లైవా అనంత‌రం త‌న కారులో ఇంటికి చేరుకున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్‌ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తైంది. న‌వంబ‌ర్ 4న ఈ చిత్రాన్ని  విడుద‌ల చేసేందుకు మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కీర్తిసురేష్‌లతో పాటు మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement