టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ఐపీఎల్ 16వ సీజన్‌లో ధోని నేతృత్వంలోని సీఎస్‌కే ఐదోసారి టైటిల్ నెగ్గింది. అయితే ధోని ఐపీఎల్ 16వ సీజన్ సందర్భంగా మోకాలి గాయంతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే తలా నీ-క్యాప్(Knee Cap)పెట్టుకొని ఆడాడు. నాకౌట్ దశకు చేరుకునే సరికి ధోని పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అందుకే బ్యాటింగ్ సమయంలో క్రీజులోకి వస్తే ఎక్కువగా బౌండరీలు, సిక్సర్ల మీదనే దృష్టి సారించేవాడు. ఇప్పటికైతే మోకాలి గాయం తగ్గినప్పటికి సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది.
ఈ విషయం పక్కనబెడితే ఇటీవలే చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ధోని ప్రొడక్షన్ హౌస్ నుంచి LGM(ఎల్‌జీఎం) అనే తమిళ సినిమా తెరకెక్కుతుంది. కాగా ధోని సోమవారం తన భార్య సాక్షితో కలిసి సినిమా లాంచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చాడు.
విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అందులో ఒక అభిమాని.. మహీ భయ్యా నీ మోకాలి నొప్పి ఎలా ఉంది.. తర్వాతి ఐపీఎల్ ఆడతావా అంటూ ప్రశ్నించాడు. కానీ ధోనికి ప్రశ్న సరిగ్గా వినిపించలేదు. అభిమానులు ఏది అడిగినా అది మన మంచి కోసమే అయి ఉంటుందని ధోనికి తెలుసు.. అందుకే బాగానే ఉన్నా అన్నట్లు చేతులు ఊపుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక జూలై 7న ధోని 42వ పుట్టినరోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు పురస్కరించుకొని ధోనికి అభిమానులు సహా వివిధ దేశాల క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని స్థితి. తొమ్మిది నెలల తర్వాత తాను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఐపీఎల్ 2024 ఆడుతానని ధోని ఇదివరకే తెలిపాడు.
చదవండి: David Warner: హుందాగా తప్పుకుంటాడా లేక తప్పించే దాకా తెచ్చుకుంటాడా..?
Comments
Please login to add a commentAdd a comment