న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. బుధవారం లాగే గురువారం కూడా పొగమంచు కారణంగా జనజీవనం స‍్తంభించిపోయింది. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఈ రోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు, వెలుతురులేమి కారణంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు.
అలాగే ఉత్తర రైల్వే పరిధిలో దాదాపు 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిన్న కూడా పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.
తాత్కాలికంగా విమాన రాకపోకలు రద్దు
Published Thu, Dec 1 2016 8:39 AM | Last Updated on Tue, Oct 2 2018 7:43 PM
Advertisement
Advertisement