
మన్యంలో కొనసాగుతున్న చలి తీవ్రత
అరకు: మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఆదివారం రాత్రి లంబిసింగిలో 6 డిగ్రీలు, అరకు, పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెల్లవారినా పొగమంచు వీడక మంచు దుప్పటిని తలపిస్తుండటంతో.. స్థానికులు పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్ల సాయంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.