less temparatures
-
మన్యంలో కొనసాగుతున్న చలి తీవ్రత
అరకు: మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఆదివారం రాత్రి లంబిసింగిలో 6 డిగ్రీలు, అరకు, పాడేరులో 8 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారినా పొగమంచు వీడక మంచు దుప్పటిని తలపిస్తుండటంతో.. స్థానికులు పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్ల సాయంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. -
మన్యంలో మంచుదుప్పటి
పాడేరు: మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీంతో పర్యటకులతో పాటు స్ధానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం రాత్రి లంబసింగిలో 11 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 13 డిగ్రీలు, మోదుకొండమ్మ పాదాల వద్ద 12 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆదిలాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రత
హైదరాబాద్: వార్దా తుపాను కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్లో 6, మెదక్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అతి తక్కువ. ఆదిలాబాద్లో తాజాగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత తెలంగాణ జిల్లాల్లో మూడో అతి తక్కువదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రిపూట సాధారణంకన్నా 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తుపాను తీరందాటిన తరువాత ఈనెల 12న తెలంగాణలో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయి. హైదరాబాద్లో ఈరోజు 14-15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.