ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత
హైదరాబాద్: వార్దా తుపాను కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో 6, మెదక్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇదే అతి తక్కువ. ఆదిలాబాద్‌లో తాజాగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత తెలంగాణ జిల్లాల్లో మూడో అతి తక్కువదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రిపూట సాధారణంకన్నా 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తుపాను తీరందాటిన తరువాత ఈనెల 12న తెలంగాణలో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు 14-15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.