vardha cyclone
-
మీ నెట్ ఎందుకు స్లో అయిందో తెలుసా?
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ బాగా స్లో అయ్యింది. పేజీలు లోడ్ కావడానికి ఇంతకుముందు కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఏం జరిగిందోనని కొంతమంది ఆందోళనతో తమ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్లు చేశారు. కానీ తప్పు వాళ్లది కాదు.. వర్ధా తుపానుది! అవును.. వర్ధా తుపాను తీవ్రత కారణంగా సముద్రగర్భంలో ఉన్న పలు టెలికం కంపెనీలకు చెందిన కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఎయిర్టెల్ కేబుళ్లు బాగా ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇతర కంపెనీలకు చెందిన కేబుళ్లు కూడా దెబ్బతినడంతో నెట్ బాగా స్లో అయిందని నిపుణులు చెబుతున్నారు. చెన్నై తీరంలో సంభవించిన తీవ్ర పెనుతుపాను కారణంగా సముద్రగర్భంలో ఉన్న తమ అంతర్జాతీయ కేబుళ్లు దెబ్బతిన్నాయని, దాంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ పాక్షికంగా ప్రభావితం అయ్యిందని.. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్/డేటా స్పీడు బాగా తగ్గిందని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయమై కస్టమర్లకు కూడా పలువురు సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. దెబ్బతిన్న కేబుళ్లను సరిచేసేందుకు, ఆపరేషన్లను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. తమ కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయని వోడాఫోన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్.. ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన కేబుళ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
‘వర్దా’గ్రహం తప్పింది
తీరం వెంబడి ఎగసిపడిన అలలు కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసం రోడ్డును మూసివేసిన అధికారులు గల్లంతైన మత్స్యకారుడు సురక్షితం మధురపూడి–చెన్నై విమాన సర్వీసులు రద్దు వర్షం పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని... సోమవారం మధ్యాహ్నం తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతాంగంలోనే కాదు జిల్లా ప్రజల్లోనూ వణుకు పుట్టించింది. వర్దాగ్రహం తమిళనాడుపై చూపించడంతో జిల్లాలో చిరుజల్లులకే పరిమితమైనా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాలు ఇంకా భయం గుప్పెట్లోనే ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలానికి చెందిన ఇద్దరు గల్లంతై ఒకరు ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నాడు. సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాకు ’వర్దా’గ్రహం తప్పింది. జిల్లాలోనే ’వర్దా’ తీరం దాటుతుందన్న వార్తల నేపథ్యంలో తీరం వెంబడి గ్రామాలు, ఖరీఫ్ వరి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి దక్షిణ కోస్తా– ఉత్తర తమిళనాడు మధ్యన అని ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో వర్షం పడకపోయినా వాతావరణంలో మార్పు, సముద్రంలో పెద్ద అలలు, తీరం వెంబడి భారీ ఈదురు గాలులతో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. సముద్రం నుంచి భారీ అలలు ఎగసిపడడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దాదాపు నాలుగు కిలోమీటర్లు మేర రహదారి దెబ్బతింది. బీచ్ గోడ కూడా దెబ్బతింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షించారు. బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో కాకినాడ ఆర్డీవో అంబేడ్కర్, తహసీల్దార్ సింహాద్రి సూర్యారావుపేట, నేమం ప్రాంతాలను పరిశీలించి కాకినాడ–ఉప్పాడ రోడ్డును మూసివేశారు. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో సముద్ర అలలకు తీరం కోతకు గురైంది. ఫలితంగా పలువురి మత్స్యకార గృహాలు ధ్వంసమయ్యాయి. సముద్ర తీరంలో లంగరు వేసిన బోట్లు ధ్వంసమవుతుండడంతో మత్స్యకారులు తమ బోట్లను, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. ఎండు చేపల కల్లాలు ముంపునకు గురవడంతో రూ. లక్షల విలువైన ఎండు చేపలు దెబ్బతిన్నట్లు మత్స్యకారులు వాపోతున్నారు. ఊపిరి పీల్చుకున్న రైతులు ‘వర్దా’ అతి త్రీవ తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా లేకపోవడంతో రైతులు ఊరట చెందారు. ఖరీఫ్ కోతలు, ఓదెలపై వరి పనలు జిల్లాలో ఇంకా 30 శాతం మేర మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి రైతులు తీవ్ర భయాందోళన మధ్య పంటను కాపాడుకునే ప్రయత్నాల చేశారు. తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైలో అధికంగా ఉండడంతో మధురపూడి నుంచి చెన్నై వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులు వేటకు వెళ్లొద్దు తొండంగి మండలం తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఉధృతం కావడంతో మత్స్యకారులు బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురు గాలులు ఎక్కువగా ఉండడంతో తీరప్రాంత గృహాలు దెబ్బతిన్నాయి. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామాన్ని మత్స్యశాఖ డీడీ ఎస్.ఏంజలీనా సందర్శించారు. స్థానిక మత్స్యకారులు, వలస మత్స్యకారులతో మాట్లాడారు. తుపాను నేప«థ్యంలో మరో రెండు రోజులపాటు సముద్రంలో వేటకు Ðð వెళ్లవద్దని సూచించారు. -
'వర్దా' అంటే ఎర్ర గులాబీ
న్యూఢిల్లీ: తమిళనాడులో బీభత్సం సష్టిస్తోన్న తుపానుకు 'వర్దా' అని పేరు పెట్టారు. పాకిస్తాన్ సూచించిన ఈ పేరుకు అరబిక్, ఉర్దూ భాషల్లో ఎర్ర గులాబీ అని అర్థం. హిందూ మహాసముద్రంలో అంతర్భాగమైన బంగాళాఖాతంలో పుట్టిన నాలుగవ భీకర తుపాను వర్దా. ఇంతకుముందు రొహాను, క్యాంత్, నాడ తుపానులు వచ్చి పోయాయి. ఈ తుపానులకు పేర్లు ఎవరు ఖరారు చేస్తారు, వాటిని ఎవరూ సూచిస్తారన్నది ఇక్కడ ప్రశ్న. అట్లాంటిక్, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో తుపానులకు పేర్లు పెట్టే ఆచారం 1953 నుంచే అమల్లో ఉండగా, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో వచ్చే తుపానులకు పేర్లు పెట్టే ఆచారం 2004 నుంచి వచ్చింది. తుపానులకు పేర్లు పెట్టినట్లయితే ఆ తుపాను పేరిట ముందస్తు పటిష్ట నిరోధక చర్యలు తీసుకోవచ్చని, ఆ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని చరిత్రలో సులభంగా నమోదు చేయవచ్చనే ఉద్దేశంతో ఆ సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తుపానులకు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఏ తుపాను సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నామో సులభంగా విశ్లేషించడం ద్వారా ముందస్తు చర్యలకు వీలు పడుతుందని సదస్సులో పాల్గొన్న దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ సదస్సులో పాల్గొన్న భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మొత్తం 64 తుపాను పేర్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతానికి ఆ జాబితా నుంచి ఎంపిక చేసిన పేర్లనే పెడుతున్నారు. గతంలో వచ్చిన నాడా తుపానుకు పేరును సూచించినది ఓమన్ దేశం కాగా ఇప్పుడు వర్దా అన్నది పాకిస్తాన్ సూచించిన పేరు. తుపాను వచ్చినప్పుడల్లా ఈ జాబితాలోని పేర్లను ఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం ఎంపిక చేస్తుంది. సామాన్య ప్రజలు కూడా ఐఎండీ కార్యాలయంలోని మెటరాలోజీ డైరెక్టర్ జనరల్‌కు తుపాను పేర్లను సూచించవచ్చు. కాని వాటి ఎంపికకు కచ్చితమైన ప్రక్రియ ఉంటుంది. సూచించే పేర్లు ప్రత్యేకంగా ఓ దేశాన్నిగానీ, ప్రాంతాన్నిగానీ, సంస్కతినిగానీ సూచించే విధంగా ఉండరాదు. అవమానకరంగా, అభ్యంతరకరంగా ఉండకూడదు. వీలైనంత చిన్నదిగా ఉండడమే కాకుండా సులభంగా గుర్తుండే విధంగా కూడా ఉండాలి. అట్లాంటిక్, తూర్పు పసిఫిక్ దేశాలు తుపాను పేర్లను కొన్నేళ్ల తర్వాత రిపీట్ చేస్తారు. హిందూ మహాసముద్ర తుపానుల పేర్లు ఒక్కసారితోనే చరిత్రలో కలసిపోతాయి. -
‘చెన్నైలో వరదలు వచ్చే అవకాశం లేదు’
-
వర్ధా బీభత్సం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా!
-
తీరాన్ని తాకిన వర్దా తుపాను
-
రంగంలోకి దిగిన 15 ఎన్డీఆర్ఫ్ బృందాలు
-
చెన్నైఎయిర్ పోర్ట్ మూసివేత
-
ప్రకాశం జిల్లాలో వర్దా ఎఫెక్ట్
-
చెన్నైను వణికిస్తున్న వర్దా తుపాను
-
దిశ మార్చుకున్న 'వార్దా'
-
దిశ మార్చుకున్న 'వార్దా'
విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర పెను తుపాను వార్దా ఆదివారం దిశ మార్చుకుంది. తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వార్దా అధిక ప్రభావం చెన్నైపై ఉండనుంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఆదివారం ఉదయం వరకూ కోస్తాంధ్ర వైపు దూసుకువచ్చిన తుపాను.. ఒక్కసారిగా చెన్నై దిశగా పయనించడం ఆరంభించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 490, చెన్నైకి తూర్పున 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావం కారణంగా పుదుచ్చేరి, తమిళనాడు ఉత్తర సముద్రతీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలు వాయిదాపడ్డాయి. తుపాను కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు. -
ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత
హైదరాబాద్: వార్దా తుపాను కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో 6, మెదక్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అతి తక్కువ. ఆదిలాబాద్‌లో తాజాగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత తెలంగాణ జిల్లాల్లో మూడో అతి తక్కువదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రిపూట సాధారణంకన్నా 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తుపాను తీరందాటిన తరువాత ఈనెల 12న తెలంగాణలో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు 14-15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
వార్దా నీటిని నిల్వ చేసుకోండి
- ప్రజలకు సీఎం పిలుపు - తుపానుపై సమీక్షించిన చంద్రబాబు - అరబ్ దేశాల పర్యటన వాయిదా సాక్షి, అమరావతి: వార్ద తుపాను వల్ల కురిసే వర్షపు నీటిని ఎక్కడికక్కడ నిల్వచేసు కోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కడప, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు 15 నుంచి 22 మీటర్ల వరకూ తగ్గిన నేపథ్యంలో ప్రజలు చైతన్యంతో వ్యవహరించి తమ గ్రామాల్లోని చెరువులకు వర్షపు నీటిని మళ్లించాలన్నారు. తుపానుకు సంబంధించి శనివారం ఉదయం సీఎం తన నివాసంలో అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వార్ద తుపాను, నోట్ల రద్దు, వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. తుపాను నేప«థ్యంలో తాను ఆదివారం నుంచి చేపట్టాల్సిన అరబ్ దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. వార్దా తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లోని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నట్లు చెప్పారు. డిజిటల్ లావాదేవీలవైపు మళ్లడమే.. నగదు లేదనే కారణంతో ఖర్చులు వాయిదా వేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, డిజిటల్ లావాదేవీలు పెంచటమే ఏకైక మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం తన నివాసం నుంచి ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరాలకు నిధులిచ్చే పరిస్థితి లేదు పట్టణ, నగర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయించే పరిస్థితి ప్రస్తుతం లేదని సీఎం అన్నారు. మున్సిపల్, నగర పాలనపై శనివారం అధికారులతో సమీక్ష జరిపారు. -
వార్ధా తుపానుపై బాబు సమావేశం
విజయవాడ: వార్ధా తుపానుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అధికారలతో సమావేశమయ్యారు. సమావేశానంతరం మాట్లాడుతూ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే నాలుగు జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రానికి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన.
-
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: వార్దా తుఫాను నెల్లూరుకు ఆగ్నేయ దిశలో 820 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో నెల్లూరు వైపు పయనిస్తోంది. దీని ప్రభావం వల్ల ఆదివారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా వార్దా తుఫాను కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపటి వరకు తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. ఏపీ తీరానికి చేరుకునే సరికి వార్దా తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. సోమవారం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు వెళ్లాల్సిన యూఏఈ, కువైట్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వార్దా తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. -
12న తీరందాటనున్న వార్ధా తుపాను
అమరావతి: నెల్లూరు, కాకినాడల మధ్య ఈ నెల 12న వార్ధా తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 1090 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. 10వ తేదీన జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని.. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన జాలర్లు తిరిగి తీరానికి చేరుకోవాలని.. ఎప్పటికప్పుడు సమాచారానికి అనుగుణంగా జాగ్రత్త వహించాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పోర్టు బ్లేయిర్ కు పశ్చిమంగా 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. తుపాను తీరం దాటే సమయంలో 65-75 కీమీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.