వార్ధా తుపానుపై బాబు సమావేశం
విజయవాడ: వార్ధా తుపానుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అధికారలతో సమావేశమయ్యారు. సమావేశానంతరం మాట్లాడుతూ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే నాలుగు జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రానికి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.