తమిళనాడు రాష్ట్రాన్ని వణికిస్తున్న వర్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే మీనంబాకం, చెన్నై విమానశ్రయం పరిసరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులున్న ప్రజలు బయటకు రావద్దని, పనులను వాయిదా వేసుకోవాలని అధికారులు ఆదేశించారు.