
25 వాహనాలు ఢీ: నలుగురి మృతి
హర్యానాలో 25 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన ఒకటో నెంబరు జాతీయ రహదారి పై కర్నాల్లోని నిల్కొహెరీ సమీపంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఏముందో అస్సలు కనిపించని పరిస్థితి ఏర్పడింది.
దానివల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.