cars collide
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్‌పై ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటి వరుసగా ఆరు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌ను తొలగించడానికి ఎయిర్పోర్ట్ నిర్వాహక సంస్థ జీఎంఆర్ రికవరీ వ్యాన్‌తో రంగంలోకి దిగింది. సంఘటనా స్థలానికి చేరుకుంటుండగా దాని వెనుకనే వచ్చిన మరో కారు, వ్యాన్‌ను ఢీ కొట్టడంతో డ్రైవర్‌కు యాదగిరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో..
కారును ఢీకొట్టిన మరో కారు యువకుడు దుర్మరణం ఇద్దరికి స్వల్పగాయాలు కాకుటూరు(నెల్లూరు) : ముందు వెళ్తున్న కారును ఓకారు అధిగమించే ప్రయత్నంలో ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలు.. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామానికి చెందిన పాలెపు వేమయ్య కుమారుడు రాజశేఖర్(28) సోమవారం తిరుపతిలో ఉన్న తన బంధువు మందా ప్రసాద్ (పొదలకూరు మండలం పొనగలూరు గ్రామం)ను కలిసేందుకు తన కారులో వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇద్దరు నెల్లూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో కాకుటూరు దాటిన తర్వాత జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును రాజశేఖర్ అధికమించబోయి ఢీకొట్టాడు. దీంతో కారు పల్టీలు కొడుతూ అవతలిరోడ్డుపై పడింది. కారు అద్దాలుపగలడంతో డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ పైకెగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజశేఖర్‌తో ఉన్న ప్రసాద్‌కు స్వల్పగాయాలయ్యాయి. వీరు ఢీకొన్న కారు ముందుభాగం దెబ్బతినగా డ్రైవర్ షేక్ మీరాజాన్బాబుకు స్వల్పగాయాలయ్యాయి. ఆమార్గంలో వస్తున్న ప్రయాణికులు వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. ఈప్రమాదం కారణంగా జాతీయ రహదారికి రెండు వైపులా ట్రాఫిక్ స్తంభించింది. వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
25 వాహనాలు ఢీ: నలుగురి మృతి
హర్యానాలో 25 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన ఒకటో నెంబరు జాతీయ రహదారి పై కర్నాల్‌లోని నిల్కొహెరీ సమీపంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ముందు ఏముందో అస్సలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దానివల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.