ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో.. | Cars collide: one killed | Sakshi
Sakshi News home page

ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో..

Published Wed, Aug 31 2016 4:37 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో.. - Sakshi

ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో..

  • కారును ఢీకొట్టిన మరో కారు
  • యువకుడు దుర్మరణం
  • ఇద్దరికి స్వల్పగాయాలు
  • కాకుటూరు(నెల్లూరు) : ముందు వెళ్తున్న కారును ఓకారు అధిగమించే ప్రయత్నంలో ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలు.. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామానికి చెందిన పాలెపు వేమయ్య కుమారుడు రాజశేఖర్‌(28) సోమవారం తిరుపతిలో ఉన్న తన బంధువు మందా ప్రసాద్‌ (పొదలకూరు మండలం పొనగలూరు గ్రామం)ను కలిసేందుకు తన కారులో వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇద్దరు నెల్లూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో కాకుటూరు దాటిన తర్వాత జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును రాజశేఖర్‌ అధికమించబోయి ఢీకొట్టాడు. దీంతో కారు పల్టీలు కొడుతూ అవతలిరోడ్డుపై పడింది.

    కారు అద్దాలుపగలడంతో డ్రైవింగ్‌ చేస్తున్న రాజశేఖర్‌ పైకెగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజశేఖర్‌తో ఉన్న ప్రసాద్‌కు స్వల్పగాయాలయ్యాయి. వీరు ఢీకొన్న కారు ముందుభాగం దెబ్బతినగా డ్రైవర్‌ షేక్‌ మీరాజాన్‌బాబుకు స్వల్పగాయాలయ్యాయి. ఆమార్గంలో వస్తున్న ప్రయాణికులు వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. ఈప్రమాదం కారణంగా జాతీయ రహదారికి రెండు వైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement